Weight Gain: చాలామంది సన్నగా ఉన్నవారు, బరువు పెరిగేందుకు మార్కెట్లో లభించే సప్లిమెంట్లు, అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. ఇవి బరువును పెంచడం పక్కనపెడితే, దీర్ఘకాలంలో ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అయితే, ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలంటే సరైన ఆహారం, పోషకాహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో కింద పేర్కొన కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే సహజమైన, సురక్షితమైన మార్గంలో బరువు పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాలు, అరటిపండు: బరువు పెరగడానికి సులభమైన, ఆరోగ్యకరమైన కలయిక పాలు, అరటిపండు. ప్రతి ఉదయం లేదా సాయంత్రం 2 అరటిపండ్లతో కలిపి ఒక గ్లాసు పాలు తాగాలి. తద్వారా శరీరానికి శక్తి, కేలరీలు లభించడమే కాదు సులభంగా వెయిట్ గెయిన్ అవ్వొచ్చు.
నెయ్యి, రోటీ: నెయ్యితో రోటీ తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన శక్తి, కొవ్వులు పుషకాలంగా లభిస్తాయి. ఇవి ఇది బరువును పెంచడంతో పాటు జీర్ణ శక్తిని బలపరుస్తుంది.
Also Read:Stale Roti: రాత్రి మిగిలిన రోటీలు ఉదయాన్నే తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌లో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజూ స్నాక్స్‌గా కూడా తినవచ్చు. కావాలంటే వీటిని నానబెట్టి కూడా తినవచ్చు. ఇవి బరువును పెంచడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
బంగాళదుంపలు: బంగాళదుంపలు, చిలగడదుంపలలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్‌తో సమృద్ధిగా ఉంటాయి. వాటిని ఉడికించడం లేదా కర్రీ లాగా తయారు చేసుకుని తినాలి. తద్వారా బరువు సులభంగా పెరగవచ్చు.
చీజ్: పనీర్, చీజ్‌లో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. వీటిని స్నాక్స్ లేదా కూరగాయలతో జోడించి తినవచ్చు.
స్మూతీలు, షేక్‌లు: ఫ్రూట్ స్మూతీలు, ప్రోటీన్ షేక్‌లు, మిల్క్‌షేక్‌లు సన్నగా ఉన్నవారి బరువు పెరగడానికి సరైన ఎంపికలు అని చెప్పవచ్చు. వీటిలో నట్స్, గింజలు, పాలు కలిపి తాగితే, అవి రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తాయి. తరచుగా వీటిని తీసుకోవడం ద్వారా సహజంగా బరువు పెరుగుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


