Fruits For Diabetes: నేటి బిజీ లైఫ్, ఆఫీస్ లో గంటల తరబడి వర్క్ చేయడం.. ఇలా అనేక కారణాల వల్ల ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశాం. దీనితో పాటు, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, రోడ్ సైడ్ ఫుడ్స్ తింటున్నాం. ఇవి అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతాయి. అంతేకాకుండా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతోంది. హెల్త్ గా ఉండాలంటే తీసుకునే ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
అయితే, డయాబెటిస్ రోగులు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దీని కోసం స్వీట్లకు దూరంగా ఉండాలి. దీనితో పాటు, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్ చేసిన జ్యూస్‌లును తీసుకోవడం మానుకోవాలి. దీంతో షుగర్ పూర్తిగా అదుపులో ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నప్పటికీ ఆహారంలో చేర్చుకునే కొన్ని పండ్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Healthy Fruits: ఈ పండ్ల కలయికతో ఆరోగ్యం మటాష్..
నేరేడు పండ్లు
ఈ పండు డయాబెటిస్ రోగులకు ఒక వరం అని చెప్పవచ్చు. ఇందులో జాంబోలిన్, జాంబుసిన్ అనే సమ్మేళనాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను స్థాయిలను నివారించడమే కాకుండా ఇన్సులిన్ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది.
జామ
జామ పండును మధుమేహ రోగులకు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. తద్వారా దీని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినే అలవాటు నియంత్రించవచ్చు. ఇది బరువు తగ్గడంతో ఎంతో సహాయపడుతుంది. ఇదే సమయంలో జామకాయ తినడం ద్వారా రక్తంలో చక్కెరను కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే, ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బొప్పాయి
మధుమేహ రోగులు బొప్పాయిని తప్పనిసరిగా తమ డైట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలో కణాలు దెబ్బతినకుండా నిరోధిస్తాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీని కారణంగానే డయాబెటిస్ రోగులు బరువు కూడా అదుపులో ఉంటుంది.
బెర్రీలు
డయాబెటిస్ రోగులు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, చెర్రీస్ వంటి బెర్రీలను తప్పనిసరిగా తినాలి. ఇవి సూపర్ ఫుడ్స్. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


