Turmeric Disadvantages: మన వంటగదిలో ఉండే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను వంటకాలలో ఉపయోగిస్తాము. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా వాటిలో పసుపు ఒకటి. చాలామంది దీని కేవలం వంటకాలలో మాత్రమే కాకుండా వివాహాలు, పూజలలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు, ఇది అందాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ క్రమంలో అపారమైన ప్రయోజనాలను అందిస్తున్న పసుపు అందరికీ ప్రయోజనకరంగా ఉండదని మీకు తెలుసా? అవును, కొంతమంది పసుపు తీసుకోవడం మంచిది కాదు. దీని ఆహారంలో భాగం చేసుకుంటే, ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. అయితే, పసుపును ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
Also Read: Health Tips: టీ తాగే అలవాటు ఉందా? అయితే ఈ సమస్యలు తప్పవు..
ఎలాంటి వారికి పసుపు హానికరం
1. గర్భవతి లేదా డెలివరీ అయినా స్త్రీలు పసుపు అధికంగా తీసుకోవడం మానుకోవాలి. ఎనదుకంటే పసుపు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగానే గర్భవతిగా ఉన్నవారికీ గర్భాశయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో డెలివరీ అయినా మహిళలు తమ బిడ్డకు పాలు ఇస్తే, అది నవజాత శిశువుకు హాని కలిగిస్తుంది.
2. కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఇప్పటికే ఏదైనా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటే, పసుపు తినకూడదు. దానిలో ఉండే కర్కుమిన్ హాని కలిగించవచ్చు.
3. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు కూడా పసుపుకు కూడా దూరంగా ఉండాలి. నిజానికి కాల్షియం ఆక్సలేట్ పరిమాణం మూత్రపిండాల్లో రాళ్లలో ఎక్కువగా ఉంటుంది. అయితే పసుపులో కూడా అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. దీని కారణంగా ఇది సమస్యలను మరింత పెంచుతుంది.
4. పసుపులో ఉండే కర్కుమిన్ పిత్తాశయ సంచిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది పిత్తాశయ సంచిని కుంచించుకుపోతుంది. దీని కారణంగా మూత్రాశయం ఖాళీ అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో పరిమిత పరిమాణంలో పసుపును తీసుకోవాలి.
పసుపు ప్రయోజనాలు
1. వాపు, నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది
2. శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
3. చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
5. గుండె ఆరోగ్యానికి మంచిది.
6. క్యాన్సర్‌ను నివారిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


