Pomegranate Disadvantages: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారు. దీని కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైట్ లో ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు, వీటిని తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి! ఈ పండ్లలో ఒకటి దానిమ్మ పండు. దీని ఎర్రటి గింజల రుచి కారణంగా తినడానికి ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.
దానిమ్మ పండు తింటే రక్తహీనతను తొలగిస్తుంది. దానిమ్మలో ఉండే ఫైబర్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మొత్తంమీద ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఈ పండు అందరికీ ప్రయోజనకరంగా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని తినడం మానుకోవాలి. ఈ నేపథ్యంలో దానిమ్మను ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
1. ఇప్పటికే అలెర్జీలతో బాధపడుతున్నవారు పొరపాటున కూడా దానిమ్మను తినకూడదు. ఇది అలెర్జీ సమస్యను మరింత పెంచుతుంది. ముఖ్యంగా చర్మ అలెర్జీలు ఉన్నవారు అసలు తినకూడదు. దానిమ్మ పండు ఐరన్ లోపాన్ని తీరుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో చర్మ అలెర్జీ ఉన్నవారు దీని తింటే చర్మంపై ఎరుపు ఎక్కువగా కనిపిస్తుంది.
2. తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా దీనిని తినకుండా ఉండాలి. ఎందుకంటే దానిమ్మపండు చల్లని ప్రభావం శరీరంలో రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. దీని కారణంగా, రక్తపోటు మరింత తగ్గుతుంది.
Also Read: Health: రాత్రి పడుకునే ముందు జాజికాయ తింటున్నారా..అయితే జరిగేది ఇదే..!
3. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటే, దానిమ్మపండుకు దూరంగా ఉండాలి. దీని చల్లని ప్రభావం కారణంగా, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను మరింత పెంచుతుంది.
4. వైరల్ లేదా దగ్గు సమస్య ఉన్నప్పటికీ దానిమ్మపండుకు దూరంగా ఉండాలి. దాని చల్లని స్వభావం కారణంగా జలుబు, దగ్గు సమస్య పెరుగుతుంది. అలాగే, ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
5. ఏదైనా మానసిక అనారోగ్యం ఉంటే, అధిక మోతాదులో మందులు తీసుకుంటుంటే, దానిమ్మపండు తినకూడదు. ఎందుకంటే దీని తినడం మెదడులోని నరాలను చల్లబరుస్తుంది. దీని కారణంగా, మెదడు ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


