Chia Seeds For Health: చియా విత్తనాలను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. కానీ, వీటిని సరైన పద్దతిలో తీసుకోకపోతే ప్రయోజనాలకు బదులుగా హాని కలిగిస్తుంది. చియా విత్తనాలను సరిగ్గా ఉపయోగించకపోతే, జీర్ణ సమస్యలు, గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. అయితే, ఇప్పుడు చియా విత్తనాలు తినేటప్పుడు చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకుందాం.
నానబెట్టకుండా తినడం
చియా గింజలను నానబెట్టకుండా తింటే ఎంతో ప్రమాదకరం. వీటిని నీటిలో నానబెడితే నీటిని పీల్చుకొని బాగా ఉబ్బుతాయి. ఇకవేళ చియా గింజలను నేరుగా తింటే అవి కడుపులో ఉబ్బుతాయి. దీంతో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల చియా విత్తనాలను అరగంట పాటు నీటిలో నానబెట్టిన తర్వాత తినాలి.
Also read: Astrology: శతాబ్దం తర్వాత అద్భుతం.. జూలైలో అపర కుబేరులు కానున్న రాశులివే..!
అధిక మోతాదులో తీసుకోవడం
చియా గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోజుకు 1-2 టీస్పూన్లు (10-15 గ్రాములు) కంటే ఎక్కువ తీసుకోకూడదు. కానీ, చాలా మంది వీటి వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతామని ఎక్కువ పరిమాణంలో తింటుంటారు. ఇలా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు లేదా నిర్జలీకరణానికి కారణమవుతుంది.
తగినంత నీరు తీసుకోకపోవడం
చియా గింజలు శరీరం నుండి నీటిని గ్రహిస్తాయి. కాబట్టి వాటిని తిన్న తర్వాత పుష్కలంగా నీరు త్రాగడం ముఖ్యం. లేకపోతే, డీహైడ్రేషన్ లేదా మలబద్ధకం సమస్యవస్తుంది. అందువల్ల, చియా గింజలను తింటే, నీటిని పుష్కలంగా తాగాలి. ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు తాగాలి.
తప్పు సమయంలో తినడం
చియా గింజలను ఉదయం అల్పాహారంతో లేదా భోజనానికి ముందు తినడం ఉత్తమం. ఒకవేళ రాత్రిపూట వాటిని తింటే కడుపు బరువుగా అనిపించవచ్చు. అంతేకాకుండా నిద్ర కూడా ప్రభావితం కావచ్చు. కాబట్టి వాటిని అల్పాహారంలో చేర్చడానికి ప్రయ్నతించాలి.
Also Read: Thyroid Health: థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి..
నాణ్యత లేని చియా విత్తనాలు కొనడం
మార్కెట్లో కల్తీ లేదా నాణ్యత లేని చియా విత్తనాలు దొరుకుతాయి. ఎప్పుడు సేంద్రీయ, ధృవీకరించబడిన బ్రాండ్ల చియా విత్తనాలను కొనుగోలు చేయాలి.
కొన్ని ఆహారాలతో కలిపి తినడం
నట్స్, సీడ్స్ వంటి పదార్థాలతో చియా విత్తనాలను కలిపి తినడం వల్ల కడుపులో వాయువు ఏర్పడవచ్చు. దీంతో వీటితో కలిపి తినకూడదు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది


