Tuesday, September 17, 2024
Homeహెల్త్Thick hair: ఒత్తైన జుట్టుకు చిట్కాలు

Thick hair: ఒత్తైన జుట్టుకు చిట్కాలు

 విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నువ్వుల నూనెను తలకు రాసుకుని కొంచెం సేపైన తర్వాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
 మందార ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి కొంచెం సేపైన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కూడా జుట్టు ఊడదు.
 ఉసిరి రసం తీసి తలకు రాసుకుంటే జుట్టు ఊడడం తగ్గడంతోపాటు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 దోస గింజలు ఎండబెట్టి దంచి నూనె తీసి, ఆ నూనెను నిమ్మరసంతో కలిపి తలకు రాస్తే కూడా వెంట్రుకలు ఊడటం తగ్గుతుంది.
 చేమదుంపల రసం తలకు రాసుకుంటే కూడా జుట్టు ఊడడం తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
 నాలుగు టీస్పూన్ల కొబ్బరి పాలలో ఒక స్పూను నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి కొంచెం సేపయిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
 షాంపులతో కాకుండా కుంకుడుకాయరసం లేదా షీకాయరసంతో తలస్నానం చేస్తే వెంట్రుకలు
దెబ్బతినకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకలు కూడా ఊడిపోవు. జుట్టు పెరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News