Saturday, November 15, 2025
Homeహెల్త్Thyroid: ఇలాంటి లక్షణాలుంటే అస్సలు లైట్ తీసుకోవద్దు.. ముఖ్యంగా మహిళలు!

Thyroid: ఇలాంటి లక్షణాలుంటే అస్సలు లైట్ తీసుకోవద్దు.. ముఖ్యంగా మహిళలు!

Thyroid disease symptoms: మనం తినే ఆహారం, వాతావరణ కాలుష్యంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఇది చాలా మందిని వేధిస్తుంటుంది. థైరాయిడ్ అనగానే కేవలం గొంతులో వాపుకు సంబంధించినదిగా భావిస్తారు. కానీ లక్షణాలు శరీరం అంతటా కనిపిస్తుంది. శరీర బరువు పెరగడం లేదా తగ్గడం థైరాయిడ్ ప్రారంభ లక్షణాలుగా గుర్తించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి పెరుగుదల, దాని పరిమాణం తగ్గడం రెండూ అనారోగ్యానికి కారణాలే. వీటికి సకాలంలో చికిత్స అందించకుంటే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

థైరాయిడ్ వ్యాధి అనగా: మీ శరీర బరువు పెరగడం లేదా తగ్గడం లేదా గొంతు వాపెక్కడం జరుగుతే… థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. దీనిలో హైపోథైరాయిడిజం అనగా తక్కువ థైరాయిడ్ చర్య లేదా హైపర్ థైరాయిడిజం అనగా అధిక థైరాయిడ్ చర్యగా వైద్య నిపుణులు అంచనావేస్తారు.ఈ రెండు సందర్భాలలోనూ లక్షణాలు కనిపిస్తాయి. అయితే, చాలా థైరాయిడ్ కేసులను మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో శస్త్రచికిత్స అవసరం అవుతుందని వైద్య నిపుణులు తెలిపారు.

సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి: మన మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది గ్రంథి థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ట్రైఅయోడోథైరోనిన్ (T3), గ్రంథి థైరాక్సిన్ (T4) వంటి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసి విడుదల చేయడానికి పనిచేస్తుంది. శరీరానికి ఈ రెండు హార్మోన్లు కూడా అవసరం.

థైరాయిడ్ గ్రంథుల ప్రధాన విధి: థైరాయిడ్ హార్మోన్‌ జీవక్రియ వేగాన్ని నియంత్రించడం..ఆహారాన్ని శక్తిగా మార్చడంకు ఉపయోగపడును. దీనిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే దాని ప్రభావ శరీరంపై పడుతుంది.

థైరాయిడ్ లక్షణాలు: బరువు పెరగడం,అలసట, చలిని తట్టుకోలేకపోవడం, మలబద్ధకం హైపోథైరాయిడిజం సాధారణ లక్షణాలు. హైపర్ థైరాయిడిజం వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, విరేచనాలు, బరువు తగ్గడం, ఆందోళన, చిరాకు వంటివి సంభవిస్తాయి. ఈ రెండు పరిస్థితులలోనూ థైరాయిడ్ గ్రంథి పెద్దదిగా మారును.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad