Saturday, November 23, 2024
Homeహెల్త్Tiny tips and benefits: చిట్టి చిట్కాలు

Tiny tips and benefits: చిట్టి చిట్కాలు

ఈ వంటింటి చిట్కాలు మీ పనిని సులభం చేస్తాయి. అవేమిటంటే
 బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే అందులో చారెడు ఉప్పు వేసి పదినిమిషాలు నీళ్లల్లో నాననిస్తే చాలు అవి నీటిలో కరిగిపోతాయి.
 పసుపు కలిపిన నీటిలో కూరగాయముక్కలు ఉంచితే ఏమైనా క్రిములు ఉంటే అవి పైకి తేలతాయి.
 గుడ్లను ఉప్పునీటిలో ఉడకబెట్టి వెంటనే చల్లనీటిలో వేస్తే వాటిపైన ఉండే పెంకు సులభంగా వచ్చేస్తుంది.
 అన్నం ఉడికేటప్పుడు రెండు మూడు చుక్కల నిమ్మరసం వేస్తే అన్నం మల్లెపువ్వులా తెల్లగా వస్తుంది. ఉడికేటప్పుడు అన్నంలో కాస్త నూనె వేస్తే ముద్దలా అవకుండా పొడిపొడిలాడుతుంటుంది.
 ముదిరిపోయిన ఆనపకాయగింజల్ని బియ్యంతో పాటు నీళ్లల్లో నాననిచ్చి పిండిలా రుబ్బి అట్లు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.

- Advertisement -

 మజ్జిగతో ఫ్లాస్కును కడిగితే అందులోంచి వచ్చే దుర్వాసన పోతుంది.
 తరిగిన బంగాళాదుంప ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే వాటిపై కాస్త వెనిగర్ చల్లాలి.
 అరటికాయముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.
 వంకాయకూరలో రెండు చుక్కల నిమ్మరసం పిండితే రంగు మారదు. కూర ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
 కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ వేసి కలిపితే పురుగుపట్టకుండా ఉంటుంది. చాలాకాలం తాజాగా కూడా ఉంటుంది.
 ఆమ్లేట్లు పొంగినట్టు రావాలంటే అందులో చిటికెడు మొక్కజొన్న పిండి లేదా పంచదార వేయాలి.
 అగరబత్తి బూడిదతో ఇత్తడి గిన్నెలు తోమితే తళ తళ మెరుస్తాయి.
 చిరుతిండి వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడి వేస్తే రుచిగా ఉంటాయి.

 వేసవిలో పాలు విరగకుండా ఉండాలంటే వాటిని నాలుగైదు పొంగులు వచ్చేవరకూ బాగా కాచాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News