భోజనం చేసిన పదిహేను నిమిషాల తర్వాత ఆపిల్ పండును సన్నని ముక్కలుగా చేసుకుని తింటే దాంట్లోని ఔషధ గుణాల వల్ల మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు తలెత్తవు.
మెడ నలుపు తగ్గాలంటే మెడ చుట్టూ వెన్న రాసి అరగంటపాటు వదిలేయాలి. తర్వాత చెంచాడు స్వర్ణముఖి ఫేస్ వాష్ ను నీళ్లల్లో కలిపి పేస్టులా చేసి దాన్ని మెడ చుట్టూ రాసి పావుగంట సేపు వదిలేయాలి. ఆ తర్వాత కాసేపు మెడను సున్నితంగా మసాజ్ చేసి నీటితో శుభ్రంగా కడగాలి. రాత్రి పడుకునే ముందు కుంకుమాది తైలం మెడకు రాయాలి. ఇలా వారం రోజుల పాటు ప్రతి రోజూ చేస్తే మెడ
చుట్టూ ఉన్న నలుపు పోయి మెడ అందంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
ఉదయం , రాత్రి భోజనం చేసిన తర్వాత జామపండు తింటే జీర్ణక్రియ బాగా జరగడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
దొండకాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బాగా పనిచేసేట్టు చేస్తుంది. మేనికి నిగారింపును ఇస్తుంది.
పనసతొనలు తింటే ముసలితనం తొందరగా రాదు. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తారు.
మజ్జిగ శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది.