Friday, September 20, 2024
Homeహెల్త్Tips: వంటింటి ఆరోగ్య చిట్కాలు

Tips: వంటింటి ఆరోగ్య చిట్కాలు

 వామును దోరగా వేగించి పొడి చేయాలి. వేడి అన్నంలో ఆ పొడిని పావు చెంచా వేసుకుని మొదటి ముద్ద తినాలి. ఇలా రోజూ చేస్తే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
 ఎండలో ఎక్కువ సేపు తిరగడం వల్ల తలనొప్పిగా అనిపించినా, తల తిరిగినట్లు ఉన్నా చిన్న అల్లం ముక్క నూరి నిమ్మరసంలో కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
 తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. అంతేకాదు ఇవి శరీరాన్ని బాగా హైడ్రేట్ చేస్తాయి. వేసవి కాలంలో ఇవి తింటే శరీరానికి ఎంతో మంచిది.
 రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డ తో మజ్జిగ అన్నం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో ఇది శరీరానికి చేసే మేలు ఎంతో.
 వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వంటి వాటి బారిన తొందరగా పడరు.
 అల్లం టీ తాగితే శరీర బరువు తగ్గుతాం.
 అరికాళ్లు మండుతుంటే గోరింటాకు రుబ్బి పాదాలకు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి కావలసిన ఎనర్జీ వెంటనే అందుతుంది.

- Advertisement -

 భోజనం చేసిన తర్వాత గ్యాసు, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే రెండు లేదా మూడు లవంగాలు నోట్లో వేసుకుని చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 నోటిదుర్వాసన సమస్యతో బాధపడుతుంటే కొన్ని తులసి ఆకులను తినాలి.
 కడుపు గ్యాసుతో పట్టేసినట్టు ఉంటే రెండు వెల్లుల్లి రెబ్బలను చెంచాడు నెయ్యితో కలిపి తింటే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News