Fruit Peels For Diabetes: ఒక వ్యక్తికి డయాబెటిస్ ఉన్నప్పుడు అలసట, అస్పష్టమైన దృష్టి, బరువు తగ్గడం, ఆకలి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు డయాబెటిస్ వ్యాధి వస్తుంది. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. దీంతో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అయితే, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కొన్ని పండ్ల తొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.
మామిడిపండు తొక్క
మామిడిపండు రుచిగా ఉండడమే కాకుండా ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో అధిక గ్లైసెమిక్ ఉంటుంది. దీనిని తినడం డయాబెటిస్ రోగాలకు అసలు మంచిది కాదు. అయితే మామిడిపండు తొక్క తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
ఆపిల్ తొక్క
ఆపిల్ పండు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఆపిల్ మాత్రమే కాదు దాని తొక్కు కూడా డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం నుండి రక్షిస్తుంది.
Also Read: EGGS: ఈ సమస్యలు ఉన్న వారు గుడ్లు అస్సలు తినకూడదు..
కివి పండు తొక్క
కివి పండు తొక్క డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ E రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అయితే షుగర్ పెరిగినప్పుడు కివి పండు తొక్క తినొచ్చు.
అరటి తొక్క
అరటిపండు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ ఇవి షుగర్ ఉన్నవారికి ఎంతో సహాయపడతాయి. అరటి తొక్క తినడం వల్ల మధుమేహ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ సహా అనేక పోషకాలు షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.
పీచ్ తొక్క
ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల పోషకాలు పీచు తొక్కలో ఉన్నాయి. పీచ్ తొక్కను తినడం డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ ఏ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.


