Saturday, November 23, 2024
Homeహెల్త్Toothpaste: మీ టూత్ పేస్ట్ ఎన్ని పనులు చేస్తుందో తెలుసా?

Toothpaste: మీ టూత్ పేస్ట్ ఎన్ని పనులు చేస్తుందో తెలుసా?

పేస్టుతో ఇలా చేసి చూడండి…
దంతాలను టూత్ పేస్టు మెరిసేలా చేస్తుంది. పళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే నిత్యం పేస్టుతో మనం పళ్లు తోముకుంటాం. పేస్టును ఇలాగే కాకుండా ఇంకా రకరకాలుగా ఉపయోగించవచ్చు. అవేమిటంటే..
 చిన్న పిల్లల పాల బాటిల్ ని టూత్ పేస్టుతో తోమితే తళ తళ లాడుతాయి. వాటిలోని దుర్వాసన కూడా పోతుంది. మీరు చేయాల్సిందల్లా కొద్దిగా టూత్ పేస్టును బాటిల్ శుభ్రం చేసే బ్రష్ పై పెట్టి దానితో ఆ సీసాల లోపలి భాగాలను బాగా రుద్ది నీటితో కడగాలి. ఇలా చేస్తే పాలబాటిళ్ల నుంచి వచ్చే చెడువాసన పోతుంది. పిల్లల పాల బాటిళ్లనే కాదు నీళ్ల బాటిళ్లని, ఫ్లాస్కులను కూడా పేస్టుతో శుభ్రం చేసుకోవచ్చు.

- Advertisement -

 టూత్ పేస్టును కొద్దిగా తీసుకుని నిద్రపోయే ముందు మొటిమల మీద అద్దితే అది వాటిల్లోని తేమని పీల్చుకుని తెల్లారేసరికి మొటిమల్ని మాయం చేస్తుంది.
 కారు హెడ్ లైట్ల మీద దుమ్ము పేరుకుని రోడ్డు అస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కొద్దిగా పేస్టు తీసుకుని స్పాంజ్ సహాయంతో హెడ్ లైట్ల మీద వ్రుత్తాకారంలో రుద్దాలి. ఆ తర్వాత తడిగుడ్డతో వాటి అద్దాలను తుడవాలి. ఇలా చేస్తే హెడ్ లైట్లపై మరకలు పోయి తళ తళ మెరుస్తాయి.
 ఇస్త్రీ పెట్టెకు బట్ట అతుక్కుని మరకపడినపుడు దాని మీద కొద్దిగా పేస్టు రాసి గరుగ్గా ఉండే బట్టతో తుడిస్తే ఆ మరక పోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News