Best Mosquito Repellent Plants: వర్షాకాలంలో క్రిమి కీటకాలు బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమలు ఎక్కువగా ఇంటి చుట్టూ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి చాలా మంది దోమల సమస్యకు మార్కెట్‌లో లభించే ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు, దోమల మందులు ఉపయోగిస్తారు. కానీ వీటి వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కానీ కొన్ని మొక్కలకు ఇంట్లో పెంచుకోవడం వల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం.
ఇంట్లో దోమలు రాకుండా తగ్గించడానికి కొన్ని రకాల మొక్కలను పెంచుకోవచ్చు. అందులో పవిత్రమైన తులసి ఒకటి. తులసి మొక్కలు ఉన్న చోట దోమలు సాధారణంగా కనిపించవు. మీరు మీ పెరటిలో ఈ మొక్కను పెంచుకోండి. దీంతో పాటు నిమ్మగడ్డి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క నుంచి సిట్రోనెల్లా నూనె దోమల బెడదను తగ్గిస్తుంది. ఈ నిమ్మగడ్డితో తయారు చేసే కొవ్వొత్తులు, మందులను మార్కెట్‌లో దొరుకుతాయి. పుదీనా కూడా దోమలను తగ్గిస్తుంది. దీని ఘాటైనా సువాసన దోమలకు నచ్చదని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క మీ ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు.
లావెండర్ మొక్క కూడా దోమల బెడదు నుంచి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో నుంచి వచ్చే సువాసన దోమలను రాకుండా చేస్తుంది. కొంతమంది లావెండర్‌లో తయారు చేసే నూనెను కూడా ఉపయోగిస్తారు. దీంతో దోమల నుంచి రక్షణ పొందవచ్చు. దోమలను తగ్గించడంలో బంతి పువ్వు కూడా సహాయపడుతుంది. ఈ పువ్వు నుంచి వచ్చే వాసన దోమలకు అసహ్యంగా ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఈ మొక్కను తప్పకుండా పెంచుకోండి.
దోమల బెడద తగ్గించే ఇతర చిట్కాలు:
సాధారణంగా దోమలు నీటి నిల్వ ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ నీటిలో వాటి గుడ్లను పెరుగుతాయి. కాబట్టి నిల్వ ఉన్న నీటిని ముందుగా తొలగించడం మంచిది. ఆ తరువాత డ్రమ్ములు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఉపయోగించిన వెంటనే మూతపెట్టండి. ఇలా చేయడం వల్ల దోమల సమస్య తగ్గుతుంది. కిటికలకు మెష్ ను తప్పకుండా వాడండి. ఇవి దోమలు లోపలకు రాకుండా చేస్తాయి.
దోమలు తగ్గించడంలో ఈ పైన తెలిపిన మొక్కలు మీకు సహాయపడుతాయి. వీటిని మీ ఇంటి వెనుక లేదా పెరటిలో ఉంచడం మంచిది. దీంతో పాటు వ్యక్తిగత సంరక్షణ చర్యలు పాటించండి.