Tuesday, December 9, 2025
Homeహెల్త్Winter Foods: చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే టాప్ ఆహార పదార్థాలు ఇవే!

Winter Foods: చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే టాప్ ఆహార పదార్థాలు ఇవే!

Top Healthy Winter Foods: చలికాలం ప్రారంభమైందంటే రోగాలకు స్వాగతం పలికినట్లే. ఈ సమయంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి (immunity) తక్కువగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం తప్పనిసరి. అయితే, చలికాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు :

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటిని ప్రతిరోజూ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ముఖ్యంగా తీసుకోవాల్సిన వాటిలో నెయ్యి ( Ghee) ఒకటి. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, జీర్ణ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలుపుకుని తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/these-vegetables-should-definitely-eat-in-winter-season/

  • బెల్లంలో (Jaggery) సెలీనియం, ఐరన్, జింక్ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో, అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బెల్లంతో తయారుచేసిన ఆహార పదార్థాలను చలికాలంలో తీసుకోవడం చాలా ప్రయోజనకరం. మహిళలు దీనిని తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
  • చలికాలంలో ప్రతిరోజూ ఉదయం నట్స్, (Nuts) తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీని ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ముఖ్యంగా వీటిలో ఉండే మెగ్నీషియం, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా మీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిది.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/effects-of-diabetes-from-the-heart-to-the-kidneys-diabetes-affects-these-organs-the-most/

  • దుంప కూరగాయలు (Root Vegetables) తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో చాలామంది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం శరీరానికి సరిపడా నీటిని తీసుకోకపోవడం, తక్కువగా ఫైబర్ తినడం. కాబట్టి క్యారెట్‌, బీట్‌రూట్‌, చిలగడదుంపలు వంటి దుంప కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
  • ఆకుకూరలను (Leafy Vegetables) ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్‌ వంటి పోషకాలు శరీరానికి లభిస్తాయి. ఇవి బద్ధకాన్ని పోగొట్టి, శరీరాన్ని చురుకుగా ఉండేలా చేస్తాయి. పాలకూర, తోటకూర, పుదీనా వంటి ఆకుకూరలను తీసుకోవడం చాలా మంచిది.
  • వీటితో పాటు సిట్రస్‌ పండ్లును (Citrus Fruits) చేర్చుకోవడం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. ఇది దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్‌ సమస్యలు రాకుండా రక్షిస్తుంది.

ఈ ఆహారపదార్థాలను తప్పుకుండా మీ డైట్‌లో చేర్చుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News