Drinks For Thyroid Health: థైరాయిడ్ సమస్య అనేది థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కలిగే ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. దీనికి హైపోథైరాయిడిజం (థైరాయిడ్ తక్కువగా పనిచేయడం), హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం) అనే రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అయితే సరైన సమయంలో దీనికి చికిత్స తీసుకోకపోతే గుండె దడ, విస్తరించిన థైరాయిడ్ (గాయిటర్), కంటి, చర్మం, ఎముకల సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అయితే, థైరాయిడ్ సమస్యలను నిర్వహించడానికి మందులు తీసుకోవడం అవసరం. దీంతోపాటు కొన్ని డ్రింక్స్ తీసుకుంటే థైరాయిడ్ బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
గోరువెచ్చని నిమ్మకాయ నీరు
ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో నిమ్మరసం కలిపి తాగితే శరీరం విషాన్ని బయటికి పంపిస్తుంది. లివర్ పని సామర్థ్యం మెరుగుపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ జీవక్రియలో కాలేయం సహాయపడుతుంది. కాబట్టి, ఈ పానీయం థైరాయిడ్ సమతుల్యతకు ప్రయోజనకరంగా ఉంటుంది.
Also read: Heathy Lungs: ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే సూపర్ ఫుడ్స్..
అశ్వగంధ టీ
అశ్వగంధ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది థైరాయిడ్ పనితీరును నియంత్రించడానికి సహాయపడే ఒక అడాప్టోజెనిక్ మూలిక. అశ్వగంధ టీ కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. అశ్వగంధ టీ కోసం ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ అశ్వగంధ పొడిని వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిని వడకట్టి త్రాగాలి.
కొబ్బరి నీరు
థైరాయిడ్ సమస్యలు తరచుగా అలసట, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతాయి. కావున వీరుకొబ్బరి నీరు తాగం మంచిది. ఎందుకంటే కొబ్బరి నీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఇతర ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను పెంచుతాయి. ఇది హైపోథైరాయిడిజం (థైరాయిడ్ తక్కువగా పనిచేయడం) ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఎక్కువగా గ్రీన్ టీ తాగడం థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజుకు 1-2 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు.
Also read: Naga Chaitanya: సమంత డైరెక్టర్‌తో నాగచైతన్య పాన్ ఇండియన్ మూవీ!
అయోడిన్ అధికంగా ఉండే స్మూతీ
థైరాయిడ్ హార్మోన్ స్రావానికి అయోడిన్ అవసరం. కావున ఒకవేళ అయోడిన్ లోపం ఉంటే పెరుగు, స్ట్రాబెర్రీ, అరటిపండు, సముద్రపు ఆల్గేతో తయారు చేసిన స్మూతీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, శరీరంలో అయోడిన్ లోపం ఉన్నప్పుడు ఈ స్మూతీలు మాత్రమే త్రాగాలి.
థైరాయిడ్ బ్యాలెన్స్ కు ముఖ్యమైన విషయాలు
1. థైరాయిడ్ ఔషధానికి ప్రత్యామ్నాయంగా ఏ పానీయాలను తీసుకోకూడదు. ప్రతిరోజూ థైరాయిడ్ మందులు తీసుకోవడం అవసరం.
2. థైరాయిడ్ సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
3. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు అయోడిన్ అధికంగా ఉండే పానీయాలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
4. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి.
5. ప్రతి మూడు నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


