Saturday, November 23, 2024
Homeహెల్త్Try wellness travelling: వెల్నెస్ ట్రావెలింగ్ చేయండి

Try wellness travelling: వెల్నెస్ ట్రావెలింగ్ చేయండి

ఈమధ్యకాలంలో చాలామందిలో ఆరోగ్యస్ప్రుహ బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా అనంతరం ఈ ధోరణి ప్రజల్లో ఎక్కువైంది. ప్రజల జీవనశైలి పోకడల్లో ఇది బాగా కనిపిస్తోంది. ట్రావలింగ్ ఎంపికలో సైతం ఈ ధోరణి మొదలైంది. అలా వెల్ నెస్ ట్రావలింగ్ కాన్సప్టు యువతలో, పెద్దల్లో ఎక్కువవుతోంది. అందుకుతగ్గట్టు ‘వెల్ నెస్ వొకేషన్’ గడపాలనుకుంటున్న వాళ్లు కూడా రోజు రోజుకీ ఎక్కువవుతున్నారు. నగరాల్లో అనుభవిస్తున్న రణగొణధ్వనుల నుంచి, కాలుష్యం నుంచి, పని ఒత్తిడి నుంచి శారీరకంగా, మానసికంగా సేద దీరడానికి ఆరోగ్యాన్ని పెంచే, మనసును ప్రశాంతంగా ఉంచే వెల్నెస్ డెస్టినేషన్లను ఎంచుకుని ఆ ప్రాంతాలకు ప్రజలు ట్రావలింగ్ చేస్తున్నారు. ఆరోగ్యంతో పాటు తమ అభిరుచులను తీర్చుకొనేలాంటి అనువైన ట్రావల్ డెస్టినేషన్లు వీళ్లు ఎంచుకుంటున్నారు.

- Advertisement -

దేశంలోని పలు ట్రావల్ డెస్టినేషన్లలో ఉండే హోటల్స్, రిజార్టుల్లో కూడా వెల్నెస్ కు సంబంధించి అత్యాధునిక సౌకర్యాలు కస్టమర్లకు అందించేందుకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం బాగా పెరిగింది. ఇటీవల అగోడా నిర్వహించిన ‘ది ఇండియా-జినస్ ట్రావల్’ పోల్ లో నిత్య జీవిత ఒత్తిడి నుంచి పారిపోయి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచే వెల్ నెస్ ట్రావల్ చేయాలని 37 శాతం మంది భారతీయులు కోరుకుంటున్నారని తేలింది. అందుకు అనుగుణంగా తమ ట్రావల్ డెస్టినేషన్లను వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటున్నారట. స్పా ట్రీట్ మెంట్లు, థెరపీలు, ఆరోగ్యకరమైన భోజనం, కులినరీ ఈవెంట్స్, ఫిట్ నెస్ యాక్టివిటీస్, సాహసాలకు అనువైన ప్రదేశాలు, ఎడ్యుకేషనల్ ప్రోగ్రాములు వంటివి ఉండేలాంటి వొకేషన్ ట్రావల్ డెస్టినేషన్లకే పర్యాటకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రకమైన ట్రావలింగ్ తమ నిత్యజీవితంలో ఆరోగ్యకర అలవాట్లకు, జీవనశైలికి తోడ్పడుతుందనే భావన చాలామంది ప్రయాణీకుల్లో కనిపిస్తోంది. మనదేశంలో వెల్ నెస్ వొకేషన్ కు తగిన డెస్టినేషన్లు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు మహారాష్ట్ర పశ్చిమ ఘూట్స్ లో ప్రక్రుతి అందాలు పర్యాటకులకు కనువిందుచేస్తాయి. అక్కడ చుట్టూరా పచ్చని కొండలు పరుచుకని ఉండి వాతావరణం ఎంతో బాగుంటుంది.

కాలుష్యానికి, రణగొణధ్వనులకు అక్కడ తావు ఉండదు. ఇక అక్కడి అందమైన ప్రక్రుతి ద్రుశ్యాలు చూపరులను మైమరిచిపోయేట్టు చేస్తాయి. తమ అన్ని బాధలను వాళ్లు మర్చిపోవడమే కాదు శరీరం కూడా ఎంతో సేదదీరుతుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి శరీరంలో ఏదో కొత్త శక్తి నిండినట్టు ఉంటుంది. పర్యాటకుల్లో ఉత్సాహం, ఎనర్జీలు ఉరకలు వేస్తాయి. ఉత్తరాఖండ్ లోని రుషికేష్ ఆధ్యాత్మిక శాంతిని పర్యాటకులకు పంచి ఇవ్వడమే కాదు సాహసప్రియులకు కావాల్సినంత మానసిక, శారీరక ఉల్లాసాన్ని కూడా ఈ ప్రదేశం ఇస్తుంది. స్వచ్ఛమైన నీటితో ప్రవహించే గంగానది, తెల్లమన్నుతో పరుచుకున్న బీచులు, చుట్టూ ఉన్న ఆకుపచ్చదనం, పర్వతాలు, రివర్ రాఫ్టింగ్, మార్నింగ్ యోగ వంటి యాక్టివిటీలు పర్యాటకులకు అందించే అనుభూతులు అనంతం. ఇక అక్కడి ఆహార రుచులు పర్యాటకుల చవులూరిస్తాయి. ఆ ప్రాంతంలో పచ్చని చెట్లు, రంగు రంగుల పూలతో, వాటి గుబాళింపులతో నిండిపోయిన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ ప్రాంతం ఎకో టూరిజానికే కాదు వైల్డ్ లైఫ్ టూరిజానికి కూడా ఎంతో పేరు. దీని చుట్టుపక్కలే ప్రముఖ నేషనల్ పార్కు శాంక్చురీలు ది కార్బొట్, ది రాజాజీ నేషనల్ పార్కు, గోవింద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఉన్నాయి. దేవతలు విహరించే ప్రదేశంగా చెప్పుకునే కేరళ ఇంకో గొప్ప వెల్నెస్ డెస్టినేషన్. అక్కడి ప్రక్రుతి అందాలు పర్యాటకులను ఎంతో పరవశింపచేస్తాయి. వారికి కావలసిన మానసిక, శారీరక ప్రశాంతిని ఇస్తాయి.

పచ్చని చెట్లతో పాటు పొడవైన కొబ్బరి చెట్ల సోయగాలు అంతటా కనిపిస్తాయి. కేరళను ‘ల్యాండ్ ఆఫ్ వెల్ నెస్’ అని చెప్పాలి. ఇక్కడ అందిస్తున్న వెల్నెస్ థెరపీలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. సంప్రదాయ ఆయుర్వేదం, యోగ వంటి వాటికి కేరళ ఎంత ప్రసిద్ధి పొందిందో అందరికీ తెలుసు. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు శారీరకంగా కొత్త ఎనర్జీని, ఆరోగ్యాన్ని పొందుతారంటే అతిశయోక్తి కాదు. ఆయుర్వేదానికి పుట్టినిల్లు అని కేరళకు పేరు. ఈ డెస్టినేషన్ పర్యాటకులను ప్రక్రుతికి ఎంతగానో చేరువ చేస్తుంది. ఈ ప్రదేశాలకు వచ్చిన వారు ఒత్తిడి, అలసటల నుంచి బయటపడి ఎంతో ఆరోగ్యంగా తయారవుతారు.అక్కడి వాతావరణం కూడా ఎంతో బాగుంటుంది. పచ్చటి హిల్ స్టేషన్లు పర్యాటకులను కనువిందుచేస్తాయి. రొమాంటిక్ గా ఉండడంతోపాటు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తాయి. స్వచ్ఛమైన గాలిని పంచుతాయి. వన్యమ్రుగాలు కూడా ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఇవే కాకుండా ఆ రాష్ట్ర కళలు, పండుగలు, రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు పర్యాటకులకు ఎంతో సంత్రుప్తిని ఇస్తాయి. మరి మీరు కూడా ఇలాంటి వెల్నెస్ డెస్టినేషన్లకు వెళ్లి ఆరోగ్యంతో, గుండెల నిండా ఆనందంతో కొత్త శక్తిని నింపుకోండి…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News