Saturday, November 15, 2025
Homeహెల్త్Health Benefits: పరగడుపున ఈ నీరు తాగితే.. క్యాన్సర్ మీ దరిచేరదంట..!

Health Benefits: పరగడుపున ఈ నీరు తాగితే.. క్యాన్సర్ మీ దరిచేరదంట..!

పసుపు మన ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం పరగడుపున పసుపు నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు లభిస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మన భారతీయ సంప్రదాయంలో పసుపు ఓ సాధారణ మసాలా దినుసుగా కనిపించినా, ఆయుర్వేదంలో దాని స్థానం చాలా ప్రత్యేకమైనది. పసుపులో ఉండే ముఖ్యమైన శక్తివంతమైన పదార్థం ‘కర్కుమిన్’. ఇది ఒక ఫైటో కెమికల్, శరీరానికి పోషకాలను అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా, ఇది శరీరంలోని వ్యాధికారక వైరస్ పై ప్రభావాన్ని చూపుతుంది. దీంతో శరీరానికి రక్షణ లభిస్తుంది.

- Advertisement -

పసుపు నీటిని ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులని నిరోధించగల శక్తి పసుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా తీసుకుంటూ వెళితే, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించే డీటాక్స్ ప్రక్రియను పసుపు వేగవంతం చేస్తుంది. అంతేకాదు, ఇది కొవ్వును కరిగించడంలోనూ సహాయపడుతుంది.

ఆరోగ్యంతో పాటు, అందాన్ని పరిరక్షించడంలో కూడా పసుపు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది, ముడతలు తగ్గుతాయి, మచ్చలు దూరమవుతాయి. ఈ నీటిలో కొద్దిగా మిరియాల పొడి కలిపితే, శోషణ సామర్థ్యం పెరిగి, పసుపు ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని సూచిస్తున్నారు.

ఈ పసుపు నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరకప్పు నీరు, ఒక చిటికెడు పసుపు పొడి, కొద్దిగా మిరియాల పొడి కలిపి బాగా కలిపి, నిద్రలేచిన వెంటనే పరగడుపున తాగాలి. దీన్ని నిత్యం అలవాటు చేసుకుంటే, శారీరక ధృడతతో పాటు, ప్రకృతి అనుగ్రహించిన ఆరోగ్యాన్నీ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారం ఆధారంగా రూపొందించినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు. దీనిని ఉపయోగించే ముందు వైద్యులు, నిపుణుల సలహా తీసుకోండి.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad