Friday, November 22, 2024
Homeహెల్త్Underarms darkness remover: చంకల కింద నల్లగా..

Underarms darkness remover: చంకల కింద నల్లగా..

చంకల్లో రాసుకుంటే నల్లదనం పోయి కాంతివంతంగా తయారవుతుంది

చంకల కింద నల్లగా ఉందా? అయితే దీన్ని వదిలించుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన మార్గాలు ఉన్నాయి. షుగర్, ఆలివ్ ఆయిల్ కలిపి చంకల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండింటి మిశ్రమం చంకల్లో చేరిన మ్రుతకణాలను పోగొడుతుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. అరటేబుల్ స్పూన్ చక్కెర, అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ రెండింటినీ తీసుకుని వాటిని బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును చంకల్లో రాసి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత సబ్బుతో చంకల్లో క్లీన్ చేసుకుని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. పెరుగు,కమలాపండు తొక్కల మిశ్రమం కూడా చంకల్లో పేరుకున్న నల్లదనాన్ని పోగొడుతుంది. పెరుగును, కమలాపండు తొక్కలను కలిపి బాగా మెత్తగా పేస్టులా చేసి దాన్ని చంకల్లో రాసుకొని స్క్రబ్ చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చంకల కింది భాగం శుభ్రంగా ఉంటుంది.

- Advertisement -

చంకల్లో నల్లదనాన్ని పోగొట్టే ఇంకొక పద్ధతి కూడా ఉంది. రెండు టేబుల్ స్పూన్ల తేనె, మూడు టేబుల్ స్పూన్ల పాలు రెండింటినీ కలిపి మెత్తగా పేస్టులా చేసి దాన్ని స్నానానికి ముందు చంకల భాగంలో రాసుకొని 25 నిమిషాల  తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడగాలి.  గాళాదుంప రసం, కండెన్సిడు పాలు రెండింటి మిశ్రమం కూడా ఈ సమస్యను పరిష్కరిస్తుంది. చంకల్లోని నల్లదనాన్ని పోగొడుతుంది. బంగాళాదుంపలను ముక్కలుగా తరిగి గ్రైండర్ వేసి జ్యూసులా తయారుచేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల కండెన్సుడు పాలు పోసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చంకల కింద భాగంలో రాసుకోవాలి. దాన్ని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకున్న తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. బేకింగ్ సోడాకు బ్లీచింగ్ ఎఫెక్టు బాగా ఉంటుంది.

ఆరోగ్యానికి కూడా ఎలాంటి హానీ చేయదు. అందుకే బేకింగ్ సోడాను నీళ్లల్లో వేసి ఆ మిశ్రమాన్ని నేరుగా చంకల్లో రాయాలి. ఇది చంకల్లో చేరిన మ్రుతకణాలను పోగొడుతుంది. కీరకాయముక్కలు, పసుపు కలిపి చేసిన పేస్టు కూడా చంకల్లోని నల్లదనాన్ని పోగొట్టడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల కీరకాయరసం, ఒక టీస్పూను పసుపు రెండింటినీ కలిపి పేస్టులా చేయాలి.  కావాలనుకుంటే నిమ్మరసం కూడా అందులో కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చంకల్లో రాసుకుంటే నల్లదనం పోయి కాంతివంతంగా తయారవుతుంది. చంకల్లో ఈ పేస్టును రాసుకుని అది ఆరేదాక అంటే ఒక అరగంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగితే చంకల భాగంలో చర్మం మ్రుదువుగా అవుతుంది.

విటమిన్ ఇ, కొబ్బరినూనె మిశ్రమం కూడా చంకల్లోని నల్లధనాన్ని పోగొడుతుంది. ఇందుకు విటమిన్ ఇ, కొబ్బరినూనె రెండింటినీ కలిపి పేస్టులా చేసి దాన్ని చంకల్లో రాసుకోవాలి. స్నానం చేసే ముందు ఈ పేస్టును చంకల్లో రాసుకుని పదినిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత సబ్బుతో చంకల్లో శుభ్రంచేసుకుని నీళ్లతో బాగా కడిగేసుకోవాలి. తర్వాత తువ్వాలుతో చంకల్లో తడిలేకుండా బాగా తుడుచుకోవాలి. ఇలా చేసి చంకల భాగాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా, ఆ ప్రదేశంలోని చర్మం మ్రుదువుగా అయ్యేలా ఉంచుకోండి మీరు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News