Dal and Uric Acid : చాలామంది యూరిక్ యాసిడ్ సమస్య ఉందంటే చాలు.. ముందుగా పప్పు దినుసులు, ప్రోటీన్ ఆహారాన్ని పూర్తిగా మానేస్తుంటారు. పప్పు తింటే కీళ్ల నొప్పులు పెరుగుతాయని, యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపు తప్పుతాయని ఒక బలమైన అపోహ ఉంది. అయితే, ఆధునిక పోషకాహార నిపుణులు , డైటీషియన్లు ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నారు. పప్పును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, దాన్ని తినే విధానం మార్చుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
ప్యూరిన్లు , యూరిక్ యాసిడ్ సంబంధం
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణం ‘ప్యూరిన్లు’ (Purines). ఇవి మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరి, విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్‌గా మారుతాయి. సాధారణంగా మాంసాహారం, సీఫుడ్, ఆల్కహాల్ , చక్కెర పానీయాల్లో ప్యూరిన్లు చాలా అధికంగా ఉంటాయి. పప్పు దినుసులలో ప్రోటీన్ ఉన్నప్పటికీ, ప్యూరిన్ల శాతం మధ్యస్థంగానే ఉంటుంది. కాబట్టి, పప్పును సరైన పద్ధతిలో వండితే అది పెద్దగా ఇబ్బంది కలిగించదు.
Sravanthi Chokarapu: పచ్చని చీరలో స్రవంతి పరవశం.. ముత్యాల మెరుపులతో మైమరపిస్తున్న యాంకర్
పప్పును ఎలా వండాలి? డైటీషియన్ సూచనలు
- నానబెట్టడం: యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు పప్పు తినాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. పప్పును వండటానికి ముందు కనీసం 2 నుండి 4 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పప్పులో ఉండే అదనపు ప్యూరిన్లు , ఫైటేట్లు నీటిలోకి వచ్చేస్తాయి.
- నీటిని పారబోయాలి: పప్పు నానబెట్టిన నీటిని వంటలో వాడకుండా పారబోసి, కొత్త నీటితో వండుకోవాలి.
- పైకి వచ్చే నురగను తీసేయాలి: పప్పు ఉడికేటప్పుడు పైన తెల్లటి నురగలా వస్తుంది. అందులో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఆ నురగను స్పూన్‌తో తీసి పారేయడం మంచిది.
మితమే అమృతం
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు పప్పును పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన అవసరమైన ప్రోటీన్ అందదు. అందుకే, రోజుకు ఒక కప్పు పప్పు లేదా పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి హాని ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆహారమే కాకుండా, శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడానికి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం, బరువు నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Viral : స్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్.. “లోపలికి రా భయం ఎందుకు” అన్న మహిళ.. వైరల్ వీడియో.!

