Effects Of Checking Mobile: నేటి రోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారు చాలా మందినే ఉన్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు వరకు కూడా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ప్రతి నిమిషానికి దానిని ఒకసారి చూడాల్సిందే అన్నట్లు మారిపోయారు. చాలా మంది ఉదయాన్నే నిద్ర లేవడంతోనే చేతిలో ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. అలా చేయడం వల్ల వారి లైఫ్ డేంజర్ లో పడినట్లే అని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి.
ఫోన్ స్క్రీన్..
నిపుణుల మాటల ప్రకారం, రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ తీసుకొని చూడటం మన ఆరోగ్యానికి అనేక రకాలుగా హానికరంగా మారుతోంది. ఇటీవల కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన విషయాల ప్రకారం, నిద్రలేచిన వెంటనే ఫోన్ స్క్రీన్ వైపు చూడటం మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తోంది. చాలామంది లేవగానే వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా అప్డేట్స్, నోటిఫికేషన్ల కోసం ఫోన్‌ని తీసుకుంటారు. ఈ అలవాటు వల్ల మనం అణచివేయలేని ఒత్తిడికి లోనవుతున్నామని పరిశోధకులు చెబుతున్నారు.
బ్లూ లైట్..
ఉదయాన్నే ప్రశాంత వాతావరణం మనస్సుకు శరీరానికి ఎంతో ప్రశాంతతను ఇచ్చేది కావడంతో అలాంటి సమయాల్లో డిజిటల్ డివైజ్ వాడకం అనవసరమైన ఆందోళనకు దారి తీస్తుంది.ఇంకా ఫోన్ స్క్రీన్‌లో ఉండే బ్లూ లైట్ మన కళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు నిపుణులు. ఈ రకమైన లైటింగ్ వల్ల కంటి సమస్యలు, పొడిబారడం, తలనొప్పులు కూడా రావచ్చు. అంతే కాకుండా, ఉదయాన్నే బ్లూ లైట్‌ని చూస్తే మన నిద్ర సైకిల్ కూడా దెబ్బతింటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి
నెగటివ్ న్యూస్, ఇన్‌ఫర్మేషన్..
సోషల్ మీడియా వినియోగం కూడా ఉదయం మూడ్‌ను గందరగోళానికి గురిచేస్తోంది. ఉదయాన్నే నెగటివ్ న్యూస్, ఇన్‌ఫర్మేషన్ చూసే సమయంలో మన మెదడు వాటిని జీర్ణించుకోలేక డిస్టర్బ్ అవుతుంది. ఇలా ఒక్కోసారి, మన రోజంతా ప్రభావితమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
ఒక ప్రముఖ మానసిక ఆరోగ్య సంస్థ చేసిన అధ్యయనంలో, నిద్రలేచిన వెంటనే ఫోన్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చే వారిలో ఒత్తిడి, ఆందోళన, నిస్సత్తువ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయంటున్నారు. ఉదయపు మొదటి కొన్ని నిమిషాలు మన మానసిక శక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయని అధ్యయనం వెల్లడించింది.
Also Read: https://teluguprabha.net/lifestyle/black-sesame-helps-hair-regrowth-stops-hair-fall-naturally/
ఈ అలవాటు మన ఆఫీస్ పనితీరునూ ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే పనులు మొదలుపెట్టాల్సిన టైంలో ఫోన్‌కు అతుక్కుపోవడం వల్ల కార్యదక్షత తగ్గిపోతుంది. అలా చూసుకుంటూ గంటలు వృథా అవుతుంటాయి. అంతేకాదు, మిగిలిన పనులన్నీ ఆలస్యం కావడం, చివరికి ఒత్తిడిలో పడటం కూడా జరుగుతుంది.
5 నిమిషాల ధ్యానం…
ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే, ఉదయం లేచిన తర్వాత ఫోన్‌ని పూర్తిగా పక్కనపెట్టి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పనులను చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోవడం, లేదా మెదడు ప్రశాంతంగా ఉండేలా 5 నిమిషాల ధ్యానం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.
అలాగే, హల్కా యోగాసనాలు, ప్రాణాయామం వంటి వాటిని ఉదయపు రొటీన్‌లో చేర్చుకుంటే శరీరం చురుగ్గా మారుతుంది. ఫోన్ స్క్రీన్‌కి బదులుగా కొద్దిసేపు ప్రకృతిని చూస్తూ నడక చేయడం లేదా తోటలో సేదదీర్చి ఉండడం కూడా మంచి మార్గం. దీనివల్ల మనసు ప్రశాంతంగా మారడంతో పాటు, ఆరోగ్య ప్రయోజనాలూ అనుభవించవచ్చు.
Also Read: https://teluguprabha.net/lifestyle/married-couples-weight-gain-linked-to-shared-food-habits/
నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫోన్‌ను ఎప్పుడైతే మనం ఉదయాన్నే ఉపయోగించవద్దని నిర్ణయించుకుంటామో, అప్పుడే మన ఆరోగ్యంపై నానాటికీ మంచి ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. శరీరం, మానసిక స్థితి రెండింటికీ ఇది ఒక మంచి మార్గంగా నిలుస్తుందని వారు అంటున్నారు.

