కళ్లకలకపై ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ప్రముఖ కంటి వైద్య నిపుణులు ఆడిమి నాగ వంశీకృష్ణ సూచించారు. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా కళ్ల కలక రావడం సహజం. కళ్ళకలకను ఐ ఫ్లూ లేదా పింక్ అయి కూడా అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు కళ్ళు ఎరుపుగా లేదా గులాబీ రంగులో మారి మంటగా అనిపిస్తుంది. ఇటీవల వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, కళ్ళ కలకలు వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటిస్తున్నారు.
కళ్ళ కళకలు అంటే ఏంటి :-
కళ్ళ కలక ఓ రకమైన ఇన్ఫెక్షన్ లాంటిది లేదా ఎలర్జీ అని కూడా అనవచ్చు మనకు జలుబు చేయడానికి కారణమైన వైరస్ కూడా ఈ కళ్ళ కలకలు వస్తాయి. ప్రధానంగా వైరస్ బ్యాక్టీరియా, ఎలర్జీల వల్ల కళ్ల కళకలు వచ్చే అవకాశం ఉంది. కంట్లో రసాయనాలు పడినప్పుడు, గాలి కాలుష్యం, ఫంగస్, కొన్ని పరాన జీవులు వల్ల కూడా కళ్ళకలకలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే ఐ ఫ్లూ లేదా వైరల్ ఫ్లూ వల్ల చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటాయి. అదే అలర్జీ ఫ్లూ అయితే అలా వ్యాపించదు. సాధారణంగా కళ్ళకలకలు వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. దీనికి కారణం వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక వైరస్ కూడా ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఉంటాయి. చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్ళను రుద్దడం వల్ల చేతి వేళ్లలోని బ్యాక్టీరియా కళ్ళల్లోకి చేరి కళ్ళ కళ్ళకలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళ్ళు ఎరుపు ఎక్కడ నీరు కారడం దురదగా ఉండడం కంటి రెప్పలు అంటుకుపోవడం వంటివి ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే కళ్ల కలకలు వ్యాపించిందని చెప్పవచ్చు. అయితే కొన్ని రకాల ఐ ఇన్ఫెక్షన్లలో కూడా అంటుకుపోతూ ఉంటాయి. సాధారణంగా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నీళ్లు కాచి చల్లార్చి కాస్త దూదిని ఆ నీటిలో ముంచి కళ్లను శుభ్రం చేసుకోవాలి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. శుభ్రమైన టవల్స్, కర్చీప్స్ వాటిని మాత్రమే వాడాలి. కళ్ళ కలక తగ్గేవరకు కళ్లజోడు పెట్టడం మంచిది. మరి ఏమైనా తీవ్రమైన సమస్యలు ఉంటే వైద్యుల సలహాలు పాటించడం తప్పనిసరి.
