Vitamin B12 Deficiency: నేటి బిజీ లైఫ్ లో మనం తీసుకునే ఆహారం పై శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశాం. ఇది మన శరీరాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ల లోపం శరీరాన్ని తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. ముఖ్యమైన విటమిన్లలో ఒకటి విటమిన్ బి12 ఒకటి. దీని లోపం ఇటీవల చాలా సాధారణమైంది. ఈ విటమిన్ మన శరీర నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, రక్త కణాలను, మెదడు పనితీరును నిర్వహించడానికి ఎంతో అవసరం. విటమిన్ బి12 లోపంతో బాధపడుతుంటే శరీరంలో అలసట, బలహీనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, రక్తహీనత వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపం ముఖ్యంగా శాఖాహారులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని ప్రధాన మూలం మాంసాహారం కాబట్టి.
విటమిన్ బి12 లోపం సంకేతాలు
1. బి12 లోపం కారణంగా శరీరంలో శక్తి ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. ఫలితంగా వ్యక్తి ఎలాంటి పని చేయకుండానే అలసటకు గురవుతాడు. రోజంతా సోమరితనంగా ఉంటాం. అంతేకాకుండా ఉదయం నిద్రలేమితో, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం జరుగుతుంది.
2. మనిషి మెదడు పనితీరులో విటమిన్ బి12 ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల స్మృతి లోపం, ఏకాగ్రత లేకపోవడం వంటివి జరుగుతాయి. మానసిక బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
3. B12 మానసిక ఆరోగ్యానికి ఎంతో దగ్గరిగా ఉంటుంది. దీని లోపం మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, చిరాకు వంటివి కలుగుతాయి.
4. ఈ విటమిన్ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని లోపం వల్ల చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి, సమతుల్యతను కోల్పోవడానికి కారణమవుతుంది.
5. B12 శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో ఎంతో సహాయపడుతుంది. దీని లోపం శరీరంలో రక్తహీనతకు కారణమవుతుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
Also Read: Packaged Food: ప్యాకేజీ ఫుడ్‌తో జాగ్రత్త! ఆ నల్ల చుక్క చూసి కొంటున్నారా.?
విటమిన్ B12 లోపాన్ని ఎలా తీర్చాలి?
1. డైట్ లో గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, చేపలు, చికెన్, రెడ్ మీట్ వంటి ఆహారాలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి B12 మంచి వనరులు.
2. మార్కెట్లో లభించే B12 బలవర్థకమైన తృణధాన్యాలు, సోయా ఉత్పత్తులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
3. వైద్యుడి సలహా మేరకు B12 సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
4. పాలకూర, బీట్‌రూట్, పుట్టగొడుగులు (మష్రూమ్స్), పాలు, పెరుగు, పన్నీర్ వంటి డైరీ ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలి.


