Saturday, November 15, 2025
Homeహెల్త్Health : ఊరికే అలసిపోతున్నారా..అయితే ఈ లోపంతో బాధపడుతున్నట్లే...!

Health : ఊరికే అలసిపోతున్నారా..అయితే ఈ లోపంతో బాధపడుతున్నట్లే…!

Vitamin D deficiency:మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్ డి ముఖ్యమైనది. ఈ విటమిన్ శరీరంలో తక్కువైతే ఎముకల సమస్యలతో పాటు గుండె ఆరోగ్యం, మానసిక స్థితిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లల్లో విటమిన్ డి తగ్గితే రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో ఎముకలు బలహీనమై కాళ్లు వంగినట్లుగా కనిపిస్తాయి. పెద్దవారిలో మాత్రం ఆస్టియోమలాసియా అనే సమస్య తలెత్తుతుంది. దీని వల్ల ఎముకలు మృదువుగా మారి నొప్పి ఎక్కువ అవుతుంది. దీర్ఘకాలంలో ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

- Advertisement -

సూర్యకాంతి తగలకపోవడం…

విటమిన్ డి లోపానికి ప్రధాన కారణం మన జీవనశైలి. ఎక్కువగా గదుల్లోనే ఉండటం, సూర్యకాంతి తగలకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలు. మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని సహజంగా సూర్యకాంతి ద్వారా పొందవచ్చు. సూర్యుడి నుంచి వచ్చే యూవీ బి కిరణాలు శరీరాన్ని తాకినప్పుడు చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. కానీ నేటి తరం ఎక్కువగా బయటకు వెళ్లకపోవడం వల్ల ఈ విటమిన్ లోపం పెరుగుతోంది.

Also Read: https://teluguprabha.net/health-fitness/garlic-health-benefits-and-correct-way-to-eat-for-liver-and-heart/

రోగనిరోధక శక్తి తగ్గిపోవడం..

విటమిన్ డి తక్కువైతే శరీరం ఇచ్చే హెచ్చరికలు కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ అలసటగా ఉండడం, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం. అదేవిధంగా నిరాశ, ఆందోళన, జుట్టు రాలడం, గాయాలు నెమ్మదిగా మానుకోవడం, చేతులు కాళ్లలో చమటలు, సూదులు గుచ్చినట్లుగా అనిపించడం కూడా లక్షణాలుగా కనిపిస్తాయి.

ఈ విటమిన్ తక్కువైతే శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. మానసిక ఒత్తిడి, స్ట్రెస్ పెరగడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి సమస్య తలెత్తే వరకు వేచిచూడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఫ్యాటీ ఫిష్..

విటమిన్ డి పెంచుకోవడానికి సరైన ఆహారం కూడా తప్పనిసరి. చేపలలో ముఖ్యంగా సాల్మన్, మాకెరెల్, సార్డిన్స్, ట్యూనా లాంటి ఫ్యాటీ ఫిష్ మంచి వనరు. వీటిని వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరానికి కావాల్సిన విటమిన్ డి ఎక్కువ భాగం అందుతుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉండడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి.

గుడ్డు పచ్చసొన…

అలాగే గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. రోజూ రెండు గుడ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి లోటు కొంతమేర పూడుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో లభించే నాటు కోడి గుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉండటంతో అవి మరింత ఆరోగ్యకరంగా భావించబడుతున్నాయి.

పాలు, వెన్న, నెయ్యి…

పాలు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలు కూడా విటమిన్ డి కోసం మంచి వనరు. మార్కెట్‌లో లభించే పాలు, సోయా పాలు, బాదం పాలు, కొన్ని రకాల జ్యూసుల్లో కూడా విటమిన్ డి కలిపి అమ్ముతున్నారు. వాటి ప్యాక్‌పై లేబుల్ చూసి ఎంతమేరలో విటమిన్ డి ఉందో తెలుసుకోవచ్చు. ప్రతిరోజూ కొద్దిగా నెయ్యి ఆహారంలో కలిపి తింటే కూడా ఈ విటమిన్ అవసరాన్ని కొంతవరకు తీర్చుకోవచ్చు.

Also Read: https://teluguprabha.net/viral/insta360-employees-win-big-rewards-in-weight-loss-challenge/

పుట్టగొడుగులు

వెజిటేరియన్స్‌కి పుట్టగొడుగులు మంచి ఆప్షన్. ఎండలో పెరిగిన పుట్టగొడుగుల్లో డి3 కూడా కొంత మొత్తంలో లభిస్తుంది. వీటిని కూరలలో, బిర్యానీలో లేదా స్టిర్ ఫ్రై రూపంలో వండి తినవచ్చు. అదేవిధంగా చీజ్‌లో కూడా విటమిన్ డి3 ఉంటుంది. దీన్ని సలాడ్స్, చపాతీలు లేదా పనీర్ వంటకాల్లో కలిపి తింటే శరీరానికి మేలు జరుగుతుంది.

కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలు

కొన్ని సందర్భాల్లో ఆహారంతో విటమిన్ డి తీసుకున్నా శరీరం దానిని సరిగ్గా గ్రహించకపోవచ్చు. ఈ పరిస్థితిని మాలాబ్జార్ప్షన్ డిజార్డర్ అంటారు. అలాంటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. అంతేకాదు, కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో కూడా విటమిన్ డి శోషణలో ఇబ్బందులు వస్తాయి. అలాగే కొన్ని మందులు కూడా ఈ విటమిన్ స్థాయిని తగ్గించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad