Friday, November 22, 2024
Homeహెల్త్Warts or skin tags: పులిపిర్లను పోగొట్టే వంటింటి చిట్కాలు

Warts or skin tags: పులిపిర్లను పోగొట్టే వంటింటి చిట్కాలు

పులిపిర్ల సమస్యతో చాలామంది బాధపడడం చూస్తుంటాం. కొందరికి ఇవి ముఖం మీద ఏర్పడి చూడడానికి బాగుండవు. ఇవి ఎక్కువగా మెడ, చేతులు, ముఖం, పాదాలపై వస్తుంటాయి.ఈ పులిపిర్లలో రెండు రకాలు ఉన్నాయి. ఒకరకమైన పులిపిర్లు చర్మంలో కలిసిపోతాయి. ఇవి పెద్దగా నొప్పి ఉండవు కానీ దురద పెడుతుంటాయి. చేతివేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అంటారు. పులిపిర్లు తగ్గాలంటే సహజసిద్ధమైన కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. కలబంద పులిపిర్ల నివారణలో బాగా పనిచేస్తుంది. ఇందులోని మేలిక్ ఆమ్లం పులిపిర్లలో ఉండే ఇన్ఫెక్షన్ ను తగ్గేలా చేస్తుంది. కలబందలో ఉండే జిగురు పదార్థాన్ని పులిపిర్ల మీద రాస్తే అవి రాలిపోతాయి.
వెల్లుల్లిపాయలు కూడా ఎల్లిసిన్ ఫంగస్, వైరస్ వంటి బాక్టీరియాలపై పోరాడి పులిపిర్లను పోగొడతాయి. యాపిల్ సిడార్ వెనిగర్ కూడా పులిపిర్లను రాలిపోయేట్టు చేస్తుంది. దీనికి ఎసిడిక్ స్వభావం ఉండడంవల్ల కాస్త పలుచగా చేసిన తర్వాతే పులిపిర్ల మీద రాయాలి. రెండు పాళ్ల యాపిల్ సిడార్ వెనిగర్ లో ఒక పాలు నీళ్లు పోసి పలుచగా చేసి కాటన్ బాల్ ని అందులో కాసేపు నాననిచ్చి దాన్ని పులిపిర్ల మీద ఉంచి బ్యాండేజ్ వేయాలి. ఆ బ్యాండేజిని మూడు నాలుగు గంటలపాటు అలాగే వదిలేయలి. ఇలా చేయడం వల్ల గట్టిగా ఉండే పులిపిర్లు మెత్తబడి రాలిపోతాయి. అరటిపండు తొక్కలు కూడా పులిపిర్లను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.

- Advertisement -

పులిపిర్లు తగ్గడానికి ఈ టిప్పును మనవాళ్లు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు కూడా. అరటిపండు తొక్కను చిన్నగా కట్ చేసి రాత్రి పడుకోబోయే ముందు పులిపిరి ఉన్న చోట బాగా అంటేలా అరటితొక్కను అదిమిపెట్టి టేప్ వేయాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయం లేచిన తీసేయాలి. పులిపిర్లను పోగొట్టే మరో వంటింటి టిప్పు కమలాపండు తొక్కలు. ఈ పండు తొక్కలతో పులిపిరి మీద నిత్యం బాగా రుద్దాలి. ఇలా రోజూ చేయడం వల్ల పులిపిరి రంగు మారి నల్లగా అవుతుంది. రోజూ పులిపిరి మీద కమలాపండు తొక్కలతో రుద్దడం వల్ల కొన్నిరోజుల్లో అది రాలిపోతుంది. అయితే అవి రాలిపోవడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఈ విధంగా రోజూ చేస్తూ పోతే మూడు నాలుగు వారాలలో పులిపిరి రాలిపోతుంది. పులిపిరి మీద క్లియర్ నెయిల్ పాలిష్ పూయడం వల్ల అది పులిపిరి మీద పొరలా ఏర్పడి దాని వైరస్ ఇతర ప్రదేశాలకు విస్తరించకుండా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు నెయిల్ పాలిష్ ను పులిపిరి మీద అప్లై చేస్తుండాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. పులిపిరి మీద డక్ట్ టేప్ అతికించి ఐదారు రోజులు అలాగే ఉంచాలి. తర్వాత పులిపిరిని నీళ్లతో తడుపుతూ ప్యూమిక్ స్టోన్ లేదా ఎమెరీ బోర్డుతో గట్టిగా గట్టిగా రుద్దాలి.
తర్వాత కొన్ని గంటల పాటు పులిపిరి మీద ఏవీ అతికించకుండా అలాగే వదిలేయాలి. ఇలా చేస్తే పులిపిర్లు పూర్తిగా రాలిపోతాయి. ఈ పద్ధతిని అనుసరించేటప్పుడు సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. తేనెటీగల నుంచి విడుదలయ్యే స్టికీ జల్ లో బీస్ వాక్సు, ప్లాంట్ ఎక్స్టెట్రాక్ట్స్ ఉంటాయి. ఇవి పులిపిర్లను తొలగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇది మార్కెట్ లో లభిస్తుంది. దీన్ని పులిపిరి మీద పూసి ఆ ప్రదేశంలో బ్యాండేజ్ వేసి కొన్ని గంటలు అలాగే ఉంచితే పులిపిర్లు రాలిపోతాయి. పైనాపిల్ జ్యూసును పులిపిర్లమీద రకరకాలుగా వాడడం వల్ల కూడా పులిపిర్లు రాలిపోతాయి. అందులో ఒక పద్ధతి ఏమిటంటే పైనాపిల్ జ్యూసుతో ప్రతిరోజూ పులిపిర్లను బాగా తడిపి నాననివ్వాలి. ఇంకొకపద్ధతి ఏమిటంటే పైనాపిల్ జ్యూసును నిత్యం పులిపిర్ల మీద రాస్తుండాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి. బంగాళాదుంప ముక్కతో పులిపిర్ల మీద బాగా రుద్దడం వల్ల దాని రసం వాటికి బాగా
అంటుకుంటుంది.

ఇలా బంగాళాదుంప ముక్కతో రోజుకు రెండుసార్లు చేయడం వల్ల పులిపిర్లు పోతాయి. మరో సింపుల్ కిటుకు ఏమిటంటే విటమిన్ సి టాబ్లెట్ తీసుకుని పొడిచేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పులిపిర్ల మీద రాసి దానిపై బ్యాండేజ్ వేయాలి. ఆ బ్యాండేజిని ఒక రాత్రంతా ఉంచుకుని ఉదయం తీసేయాలి. ఇలా నిత్యం కొన్ని రోజుల పాటు చేస్తే పులిపిరి రాలిపోతుంది. నిమ్మరసం, పొడి చేసిన విటమిన్ సి టాబ్లెట్ రెండింటినీ మెత్తగా పేస్టులా చేసి దానిని పులిపిరి మీద అప్లై చేస్తే అది మరింత శక్తివంతంగా పనిచేసి పులిపిర్లు వేగంగా రాలిపోతాయిట. నిమ్మరసం చర్మాన్ని ఇరిటేషన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. యాంటిమైక్రోబియల్, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఆముదం నూనె కూడా పులిపిర్లను రాలిపోయేట్టు చేయడంలో ఎంతో శక్తివంతంగా పనిచేసే నేచురల్ రెమిడీ. మీరు చేయాల్సిందల్లా నిత్యం పులిపిర్ల మీద ఆముదం నూనె రాస్తుండాలి. ఇలా రోజూ చేయాలి. ఈ పద్ధతిలో పులిపిర్లు పోవడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. పలుచగా చేసిన టీట్రీ ఆయిల్ ను పులిపిర్ల మీద రాయడం వల్ల కూడా అవి రాలిపోతాయి. ఇందుకుగాను మీరు చేయాల్సిందేమిటంటే ఒకటి లేదా రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ లో పన్నెండు చుక్కల కేరియర్ ఆయిల్ అంటే బాదం లేదా ఆముదం నూనెను వేసి కలిపి నాలుగైదు చుక్కల ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ మీద వేయాలి. దాన్ని పులిపిర్ల మీద ఐదు నుంచి పదినిమిషాల పాటు అలాగే
ఉంచాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని రాసుకున్నప్పుడు చర్మం ఇరిటేషన్ కు గురైతే టీ ట్రీ ఆయిల్ ని మరింత పలుచగా తయారుచేసుకోవాల్సి ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ కూడా పులిపిర్లు తొలగించడంలో బాగా పనిచేస్తుంది. సాలిసిలిక్ యాసిడ్ ప్యాచెస్, జెల్ వంటివి కూడా మార్కెట్ లో దొరుకుతాయి. ఇవి పులిపిర్లను తగ్గిస్తాయి. వీటిని వినియోగించేటప్పుడు వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. పులిపిర్లను తొలగించడానికి మంచి వైద్య చికిత్సలు కూడా ఎన్నో ఉన్నాయి. పులిపిర్లు పోగొట్టుకోవాలంటే వైద్యుల సలహాను అనుసరించి మీ చర్మానికి సరిపడే పద్ధతులను అనుసరించడం ఉత్తమం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News