Friday, November 22, 2024
Homeహెల్త్Watermelon: పుచ్చకాయ ముక్కలు ఫ్రెష్ గా ఉండాలంటే

Watermelon: పుచ్చకాయ ముక్కలు ఫ్రెష్ గా ఉండాలంటే

వేసవి అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చే పండు పుచ్చకాయ. ఈ పండు ముక్కలను నేరుగా తినడమే కాదు స్మూదీల్లో, సలాడ్లలో, కాక్ టైల్స్, డెజర్టులు వంటి రకరకాల పదార్థాల తయారీలో వాడుతారు. వేసవిలో శరీరానికి బోలెడు హైడ్రేషన్ ని అందించే పుచ్చకాయలను సరైన పద్ధతిలో స్టోర్ చేయకపోతే తొందరగా పాడయిపోతాయి.
పుచ్చకాయముక్కలు తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్ లో స్టోర్ చేయొచ్చు. అయితే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల పుచ్చకాయ ముక్కల్లో ఉండే మాయిశ్చర్ పోదు. ఎక్కువ కాలం వీటిని ఫ్రిజ్ లో ఉంచితే పుచ్చకాయలోని పోషకవిలువలు తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి తొందరగా వాటిని తినడం మంచిదని పలు స్టడీలు చెపుతున్నాయి. అలాగే పుచ్చకాయను వెంటనే తినదలచుకోకపోతే దాన్ని గది ఉష్ణోగ్రతలో ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆ పండులోని పోషకవిలువలు పోవు.

- Advertisement -

పుచ్చకాయ పచ్చిగా ఉంటే గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల తొందరగా పండుతుంది. సూర్యరశ్మి పడని ప్రదేశంలో, చల్లగా, చీకటి పరుచుకున్న చోట పుచ్చకాయను ఉంచాలి. సాధారణంగా పుచ్చకాయ మొత్తాన్ని ఒకరోజే తినలేం కాబట్టి సగం కోసిన పుచ్చకాయ ముక్క పాడయిపోకుండా ఉండడానికి క్లింగ్ ర్యాప్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. పుచ్చకాయ చిన్న ముక్కలుగా కోసుంటే వాటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్ లో భద్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పుచ్చకాయ ముక్కలు ఎండిపోవు. వాటి ముక్కల్లోని మాయిశ్చర్ పోదు.

పుచ్చకాయను భద్రపరిచేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే పుచ్చకాయను తినాలనుకున్నప్పుడు మాత్రమే దానిమీద తొక్కను తీయాలి. పుచ్చకాయను తొక్కతీసి ఫ్రిజ్ లో పెట్టకూడదు . పుచ్చకాయ మీద ఉండే తొక్క ప్లాస్టిక్ ర్యాప్ లాగే ఆ పండులోని మాయిశ్చరైజర్ ను కాపాడుతుంది. పండు ఎండిపోకుండా ఉంచుతుంది. అంతేకాదు పుచ్చకాయలోని పోషక విలువలను, రుచిని పరిరక్షిస్తుంది. బాగా పండిన పుచ్చకాయను భద్రం చేయకుండా వెంటనే తింటే మంచిది. రుచి ఉంటుంది. పండిన పుచ్చకాయను వెంటనే తినకపోతే తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పుచ్చకాయను యాపిల్స్, అరటి పండ్లతో కలిపి భద్రంచేయకూడదు. ఎందుకంటే అరటిపండు, యాపిల్ పండ్లు ఎథిలైన్ అనే గ్యాసును విడుదలచేస్తాయి.ఈ గ్యాసు పుచ్చకాయ తొందరగా పండిపోయేలా చేస్తుంది. పుచ్చకాయ ముక్కలను ఎక్కువ కాలం భద్రంచేయాలనుకుంటే ఫ్రీజర్ లో పెట్టాలి.

ఫ్రీజర్ లో పెట్టే ముందు పుచ్చకాయమీద ఉండే తొక్కను తీసేసి మీడియం సైజులో ముక్కలుగా వాటిని కట్ చేయాలి. వాటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచాలి. లేదా ప్లాస్టిక్ ర్యాపర్ లో ముక్కలను పెట్టి ఫ్రీజర్లో భద్రం చేయాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News