Sunday, July 7, 2024
Homeహెల్త్Weight loss tips: సన్నగవ్వాలంటే ఇలా తినండి చాలు

Weight loss tips: సన్నగవ్వాలంటే ఇలా తినండి చాలు

చురుగ్గా, ఆరోగ్యకరంగా ఉండాలంటే హెల్తీ వెయిట్ లో ఉండాలి

స్లిమ్ కావాలంటే ఇవి తప్పనిసరి స్లిమ్ కావడం అంత సులభం కాదు. అది ఎంతో సవాలుతో కూడుకున్నది. చాలామంది సన్నగా అవాలంటే కాలరీలు తగ్గించడం, డైట్ మీద ఉండడం చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. కాలరీలు తగ్గించినంత మాత్రాన శరీరం బరువు తగ్గుతుందనుకుంటే పొరబాటే. డైట్ మీద ఉండడం, కాలరీలు తగ్గించడం అనేవి కేవలం స్వల్పకాల ఫలితాలను మాత్రమే ఇస్తుంది. అలా అని స్లిమ్ కావడానికి ఇతర మార్గాలు లేవనికాదు. రెండు లేదా మూడు వారాల్లో శరీరం స్లిమ్ అవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే..

- Advertisement -
Glass cups with green tea and tea leaves isolated on white.

– గ్రీన్ టీ తాగడం ఒక మార్గం. గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కార్డియోవాస్క్రులర్ జబ్బులు, కాన్సర్ వంటి వాటి రిస్కును గ్రీన్ టీ తగ్గిస్తుంది. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకు పోతాయి. బరువు వేగంగా తగ్గుతారు. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. -మీరు తినే ప్రతి మీల్ కీ ప్రొటీన్ చేర్చడం వల్ల మజిల్ మాస్ మెరుగుపడుతుంది. స్టాండర్డ్ ప్రొటీన్ డైట్ కన్నా హైప్రోటీన్ డైట్ వల్ల బరువు బాగా తగ్గుతారు.

-ఎక్కువగా పండ్లు, కూరగాయలు తినడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. కూరగాయలు, పండ్లల్లో డైటరీ ఫైబర్ బాగా ఉంటుంది. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పండ్లు, కూరగాయల్లో కాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు కూడా. బాడీ మాస్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. పండిన అరటి పండ్ల కన్నా ఆకుపచ్చటి అరటిపడ్లు తినడం వల్ల బరువు తగ్గుతారు.

-బరువు తగ్గడంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా పనిచేస్తుంది. ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరేడ్స్ ప్రమాణాలను బాగా తగ్గిస్తుంది.

-బరువు తగ్గడానికి చాలామంది రిఫైన్డ్ షుగర్ వాడుతుంటారు.  ఇది ఏమాత్రం మంచిది కాదు. షుగర్ ఉన్న పదార్థాలు, అలాగే సోడా, డైట్ సోడా ఉన్నవి, కేక్, పేస్ట్రీలు, కప్ కేక్స్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, క్యాండీస్, ప్యాన్ కేక్స్, పీనట్ బటర్ కప్స్, క్యాండీడ్ యాపిల్, ఫ్రుక్టోస్, సుక్కోస్, హెచ్ ఎఫ్ సిఎస్ ఉన్న ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

-బంగాళాదుంప చిప్స్, బర్గర్స్, పిజ్జా, ఫ్రైడ్ చికెన్, ఫ్రైస్ వంటివి తినకూడదు. వీటిల్లో ఎక్కువ కాలరీలు, చక్కెర, ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటివల్ల బరువు బాగా పెరుగుతారు. ఇవి తినకుండా ఉంటే కొవ్వు వేగంగా కరగడంతోపాటు బరువు పెరగరు.

-నీళ్లు బాగా తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఒక స్టడీ ప్రకారం భోజనానికి ముందు 500 ఎంఎల్ నీరు తాగడం వల్ల మధ్యవయస్కు స్త్రీలు బరువు తగ్గుతారు. అయితే చేసే పని బట్టి, ఉంటున్న వాతావరణం బట్టి రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి.

-ఓమేగా 3 పోలీఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తో ఉంటాయి. అలాగే నట్స్, సాల్మన్, ట్యూనా, మెకరల్, శార్డినీస్, ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ వంటివి బాగా తినాలి. -ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బరువు పెరగకుండా నిరోధిస్తాయి.

-ఇంటి వంట తింటే మంచిది. ఇంట్లో భోజనం చేయడం వల్ల ఎక్కువ కాలరీలు వెళ్లవు. రెస్టారెంట్ ఫుడ్స్ లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. సాస్, డిప్స్, సలాడ్ డ్రెస్సింగ్, టెస్ట్ ఎన్ హాన్సర్స్ లకు దూరంగా ఉండాలి. వీటిని రోజూ తినడం ఆరోగ్యానికి హానికరం.

-ఫుడ్ పరిమాణం కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలరీల ఇంటేక్ తక్కువగా ఉంటుంది. బరువు కూడా బాగా తగ్గుతారు. మీ ప్లేటులో సగం కూరగాయలు ఉండాలని మరవొద్దు. పావు వంతు ప్లేటు లో లీన్ ప్రొటీన్ ఉండాలి. మిగతా నాల్గవ వంతు హోల్ గ్రెయిన్స్ ఉండాలి.  అలాగే అన్నం చిన్న ప్లేటులో తింటే తక్కువ మోతాదులో తింటారు.

-ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు అన్నదానిపై కూడా తప్పకుండా దృష్టిపెట్టాలి. తినేటప్పుడు టివి, మొబైల్, ల్యాప్ టాప్ వంటివి చూడకుండా ఆహారాన్ని ఎంజాయ్ చేయడం కూడా చాలా ముఖ్యం.

– మెల్లగా తినాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అలా చేస్తే ఫుడ్ బాగా జీర్ణం అవుతుంది. మెల్లగా తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా బరువు తగ్గుతారని ఒక స్టడీలో వెల్లడైంది.

-చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగడం మంచిది. కాఫీలోని కెఫైన్ వల్ల బిఎంఐ తగ్గుతుంది. ఫ్యాట్ కూడా తగ్గుతుంది. లావుగా ఉన్నవారిలో సైతం కెఫైన్ వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక స్టడీలో వెల్లడైంది.

-ఆల్కహాల్ జోలికి అస్సలు వెళ్లకూడదు. ప్రోబయొటిక్స్ గుడ్ గట్ బాక్టీరియా. వీటిని తీసుకోవాలి. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తాయి. దీంతో ఊబకాయం తగ్గుతుంది. జీర్ణక్రియలోని లోపాలు కూడా తగ్గుతాయి. సాదా పెరుగు బాగా తినాలి. అలాగే ప్రోబయొటిక్ డ్రింకులు, కిమ్చి వంటివి తీసుకోవాలి. -అన్నం తిన్న కొన్ని గంటల తర్వాత ఆకలి వేయడం సహజం. ఆ టైములో ఆరోగ్యవంతమైన స్నాక్స్ మాత్రమే తినాలి. వీటి ఎంపికలో జాగ్రత్త వహించాలి. బరువు వేగంగా తగ్గేలా తోడ్పడే స్నాక్స్ తినాలి. క్యారెట్, కీరకాయ, బేక్డ్ చిప్స్, హమ్మాస్, పండ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, తాజా పండ్ల రసం వంటివి తీసుకోవాలి. అనారోగ్యకరమైన స్నాక్స్ జోలికి అస్సలు వెళ్లొద్దు.

-రోజూ సాయంత్రం ఏడులోపల డిన్నర్ చేయాలి. ఆ తర్వాత వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. నడవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది కాలరీలు కూడా ఖర్చు అవుతాయి. అలాగే రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఎలాంటి స్నాక్స్ తినకూడదు. డిన్నర్ చేసిన తర్వాత రెండు మూడు గంటల లోపు నిద్రపోవాలి. డిన్నర్ చేసిన తర్వాత పళ్లు తోముకోవడం మర్చిపోవద్దు.

-రోజూ రన్నింగ్ చేయడం వల్ల కొవ్వు బాగా తగ్గుతుంది.  స్టామినా పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ కూడా బాగా మెరుగుపడుతుంది. స్లిమ్ కావాలనుకుంటే తప్పనిసరిగా రన్నింగ్ చేయాలి. రన్నింగ్ షూస్, వర్కవుట్ క్లోత్స్ తప్పనిసరిగా వాడాలి.  ట్రెడ్ మిల్ లేదా రన్నింగ్ నిత్యం చేయాలి . పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తుతున్నారో గమనించుకుంటూ రన్నింగ్ చేయాలి. ఇతర ఏరోబిక్స్ చేస్తే కూడా శరీరానికి ఎంతో మంచిది. జుంబా ఫిట్ నెస్ కూడా శరీరానికి మంచిది. ఈత, కిక్ బాక్సింగ్, వాకింగ్, నడక వంటివి బరువు తగ్గడానికి బాగా పనికి వస్తాయి.  కండరాల టోనింగ్, స్ట్రెగ్తెనింగ్ కూడా చాలా అవసరం.  దీనికి బరువులు ఎత్తాలి. బాడీ వెయిట్ వర్కవుట్లు చేయాలి. రెసిస్టెన్స్ బ్యాండ్స్, టిఆర్ఎక్స్ బ్యాండ్స్ ఉపయోగించొచ్చు. ఏదైనా అవుట్ డోర్ స్పోర్ట్ ఆడడం కూడా శరీరానికి ఎంతో మంచిది. దీనివల్ల కాలరీలు కరుగుతాయి. చెమటోడుస్తారు. ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. బాగా తిరగగలుగుతారు. బ్రెయిన్, కండరాల కోఆర్డినేషన్ బాగుంటుంది.  అలాగే ఎక్కువమంది స్నేహితులను చేసుకోవడం వల్ల ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.

-తొందరగా స్లిమ్ అవాలనుకుంటే నిత్యం మెట్లు ఎక్కాలి.  ఎలివేటర్ వాడొద్దు. ఇలా చేస్తే శరీరంలోని అదనపు కాలరీలు కరుగుతాయి. మంచి నిద్ర కూడా తప్పనిసరి. రోజుకు కనీసం ఏడుగంటలు నిద్రపోవాలి . నిద్రపోవడం వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది.  కండరాలు మెరుగుపడతాయి. నిద్రసరిగాపోకపోతే మెదడు బాగా స్ట్రెస్ అవుట్ అవుతుంది. ఏ పనీ సరిగా చేయలేరు. అంతేకాదు నిద్ర సరిగా పోకపోతే అతిగా తింటారు. ఇది శరీరానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల శరీరం బరువు కూడా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News