Weight loss Tips: చెడు ఆహారపు అలవాట్లతో చిన్న వయస్సులోనే చాలా మందిని ఊబకాయం సమస్య ఇబ్బంది పెడుతోంది. ఫాస్ట్ ఫుడ్, మసాలా వంటివి తీసుకోవడం వల్ల బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. ఇలా ఊబకాయం వచ్చిందంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, హైబీపీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి, ఆహారంలో మార్పులు ద్వారా ఈ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. దీనికోసం మీరు పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోవడంతో పాటు వ్యాయామం వంటివి చేయాలి. అలాగే మరికొన్ని టిప్స్ పాటిస్తే తప్పకుండా ఊబకాయం సమస్య నుంచి బయటపడతారు. ఈ పద్దతుల ద్వారా కేవలం నెల రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గుతారు. ఊబకాయం సమస్య నుంచి బయటపడేందుకు ఈ టిప్స్ పాటించండి.
అల్పాహారం మానేయండి
కొందరు ఉదయం టిఫిన్ అసలు తీసుకోరు. ఒకవేళ తీసుకున్న ఎలాంటి పోషకాలు లేని కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటారు. వీటివల్ల ఊబకాయం పెరుగుతుంది. మీరు ప్రొటీన్ అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, కండరాలు స్ట్రాంగ్ అవుతాయని, ఈజీగా వెయిట్ లాస్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
తృణ ధాన్యాలు తీసుకోండి
ఎక్కువగా తృణ ధాన్యాలు తీసుకుంటే బాడీకి బలంగా మారుతుంది. డ్రైఫూట్స్, నట్స్, ఓట్స్ వంటి పోషకాలు ఉండేవి ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు ప్రొటీన్ అధికంగా ఉండే గుడ్లు వంటివి కూడా తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
చక్కెరకు దూరంగా ఉండండి
చక్కెర వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే తప్పకుండా ఊబకాయం సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల డయాబెటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
మైదా తీసుకోవద్దు
మైదాతో తయారు చేసే పదార్థాలు అసలు తీసుకోకూడదు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. వీటివల్ల ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మైదా వల్ల ఎలాంటి పోషకాలు అందకపోగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. మైదా తొందరగా జీర్ణం కాదు. దీంతో కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి భోజనం తినకూడదు
రాత్రి భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, రాత్రిపూట తప్పకుండా 7:30 గంటల లోపు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల కొంతవరకు ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.
సరిపడా నిద్ర ఉండాలి
బరువు తగ్గడానికి ఫుడ్ విషయంలో రూల్స్ పాటించినట్లు నిద్ర విషయంలో కూడా పాటించాలి. బాడీకి సరిపడా నిద్ర ఉంటేనే ఈజీగా బరువు తగ్గుతారు. లేకపోతే ఊబకాయం సమస్య ఇంకా పెరుగుతారు. డైలీ తప్పకుండా 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.


