Saturday, November 15, 2025
HomeTop StoriesChia Seeds: చియా సీడ్స్ ప్రయోజనాలేమిటి..? వీటిని ఎవరు తినకూడదు..? రోజుకు ఎంత తినాలి..? పూర్తి...

Chia Seeds: చియా సీడ్స్ ప్రయోజనాలేమిటి..? వీటిని ఎవరు తినకూడదు..? రోజుకు ఎంత తినాలి..? పూర్తి వివరాలివే!

Chia Seeds Benefits: మనం తీసుకునే ఆహారం పై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా పండ్లు, తాజా కూరగాయలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇటివల కాలంలో చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పోషకాలు అవసరం. ఇందుకోసం ఆహారంలో అనేక పదార్థాలను చేర్చాలి. అందులో ఒకటి చియా విత్తనాలు. ఇవి చిన్నగా నలుపు, తెలుపు రంగులో ఉన్న వీటిలో పోషకాలు అనేకం. కావున వీటిని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. నిజానికి, చియా గింజలు బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. అందుకే చాలామంది వీటిని ఆహారంలో చేర్చుకోవడానికి దారితీసింది. అంతేకాదు చియా సీడ్స్ ఇంకా గట్ హెల్త్, గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, వీటిని సరిగ్గా తీసుకోకపోతే, ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి, చియా సీడ్స్ ఎలా తీసుకోవాలి? వాటి ప్రయోజనాలు ఏమిటి? ఎవరు తినకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

చియా సీడ్స్ ప్రయోజనాలు

చియా సీడ్స్ అనేక పోషకాల కారణంగా సూపర్‌ఫుడ్ అని పిలుస్తారు. చియా గింజలు గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరంలో ప్రొటీన్ లోపాన్ని అధిగమించాలంటే కచ్చితంగా వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. ఎముకల బలహీనంగా ఉంటె చియా సీడ్స్ సహాయపడుతాయి. ఎందుకంటే, వీటిలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇవి వయస్సు తగ్గుతున్న జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. ఆహారంలో చియా విత్తనాలను చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.

also read:Intestinal Worms: కడుపులో నులిపురుగులతో ఇబ్బంది ఉందా..?ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!

చియా సీడ్స్ తినడానికి సరైన మార్గం

చియా విత్తనాలు ఆరోగ్యకరమైనప్పటికీ వీటిని ఆహారంలో చేర్చుకునే ముందు, ఎంత మోతాదులో ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం. నిపుణుల సలహాతో మాత్రమే దీనిని మీ డైట్‌లో చేర్చాలి. పొడి చియా విత్తనాలను తినకూడదని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే అవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. చియా విత్తనాలను తినడానికి ముందు ఎల్లప్పుడూ నానబెట్టాలి. వాటిని నీరు, పాలు, పెరుగు లేదా ఏదైనా ఇతర ద్రవంలో నానబెట్టవచ్చు. చియా విత్తనాలను రోజువారీ ఆహార దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం..ప్రతిరోజూ 1 నుండి 2 టేబుల్ స్పూన్లు (15 నుండి 30 గ్రాములు) చియా విత్తనాలను తినవచ్చు.

చియా సీడ్స్ ఎవరు తినకూడదు?

చియా గింజలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని ఫైబర్‌లను జీర్ణం చేసుకోలేని వారు వాటిని నివారించాలి. దీనివల్ల కడుపునొప్పి, వాపు, విరేచనాలు, తిమ్మిర్లు వంటి సమస్యలు రావచ్చు. చియా గింజలు కొన్నిసార్లు అలర్జీ కలిగించవచ్చు. వీటిని తిన్న తర్వాత దద్దుర్లు లేదా మరి ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే తినడం మానుకోవాలి. ఇప్పటికే బిపి పేషెంట్ అయితే అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులు తీసుకుంటుంటే చియా విత్తనాలను తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad