Saturday, November 15, 2025
HomeTop StoriesBrain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి..? దీని లక్షణాలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి..? దీని లక్షణాలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Brain Stroke Risk: స్ట్రోక్ (బ్రెయిన్ స్ట్రోక్ లేదా సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అని కూడా పిలుస్తారు) అనేది మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా తగ్గడం లేదా తీవ్రంగా అంతరాయం కలిగించే ఒక ప్రాణాంతక పరిస్థితి. సాధారణంగా మెదడులో ధమని అడ్డుపడటం లేదా మెదడుకు జరిగే రక్త ప్రవాహంలో అడ్డంకి ఏర్పడినప్పుడు ఈ ముప్పు తలెత్తుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ సంభవించినప్పుడు తొలి గంటలోనే స్పందించి, వైద్యులను సంప్రదిస్తే రక్షణ లభిస్తుందని న్యూరో డాక్టర్స్ చెబుతున్నారు.

- Advertisement -

బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనప్పుడు ప్రతి నిమిషం విలువైంది. మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణలో అడ్డంకి ఏర్పడినప్పుడు అందులోని కణజాలం కొన్ని నిమిషాల్లోనే చనిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో 60 నిమిషాల్లో రోగిని ఆసుపత్రికి తీసుకురాగలిగితే కాపాడే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. అయితే ఇతరులకన్నా అధిక రక్త పోటు, అధిక కొలెస్ట్రాల్ (హైపర్లిపిడెమియా), టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి ఎక్కువ ప్రమాదం. అలాగే ఎక్కువ వయసు ఉన్నవారికి దీని ప్రమాదం మరింతగా పెరుగుతుంది. అయితే, ఒక వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉంటే, ఆ లక్షణాలు గుర్తించడం ఎలా? స్ట్రోక్ కు గల కారణాలు ఏమిటి? దీని నివారణకు ఏం చేయాలి? వంటి వివిధ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

బ్రెయిన్ సస్ట్రోక్ లక్షణాలు

1. ఆకస్మిక బలహీనత లేదా చేయి, కాలు లేదా ముఖం తిమ్మిరి. ప్రత్యేకంగా ఒకవైపు పక్షవాతం
2. ఆకస్మిక గందరగోళం. మాట్లాడటం కష్టంగా అనిపించడం లేదా మాట్లాడే సామర్థ్యం కోల్పోవడం
3. తీవ్రమైన తలనొప్పి
4.చూపు స్పష్టత లేకపోవడం లేదా రెండురకాలుగా కనిపించడం (డిప్లోపియా)
5. మూర్ఛలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం
6. తలనొప్పి, వాంతులు

బ్రెయిన్ సస్ట్రోక్ కు కారణాలు

1. రక్తం గడ్డకట్టే రుగ్మత
2. కర్ణిక సెప్టల్ లోపం లేదా వెంట్రిక్యులర్ సెప్టల్ లోపం
3. మైక్రోవాస్కులర్ ఇస్కీమిక్ వ్యాధి
4. అధిక రక్త పోటు
5. మెదడు కణితులు (క్యాన్సర్‌తో సహా)
6. స్ట్రోక్ ఇతర జీవనశైలి సంబంధిత కారణాలు
7. అధిక మద్యం వినియోగం
8. అధిక రక్త పోటు
9. అధిక కొలెస్ట్రాల్ (హైపర్లిపిడెమియా)
10.మైగ్రేన్ తలనొప్పి
11. మధుమేహం
12. ధూమపానం, పొగాకు వాడకం

బ్రెయిన్ స్ట్రోక్‌ను ఎలా నివారించాలి..?

1. జీవనశైలిని మెరుగుపరుచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుని, బరువును అదుపులో ఉంచుకోవాలి. దీంతోపాటు దినచర్యలో వ్యాయామాన్ని చేర్చడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
2. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. కావున రోజులో దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు తగినంత నిద్ర పోవాలి.
3. ధూమపానం లేదా పొగాకు వినియోగం పూర్తిగా మానుకోవాలి. అంతేకాదు, ఇతర మత్తుపదార్థాలు, మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి.
4. రక్తపోటు, చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. కుటుంబంలో ఎవరికైన స్ట్రోక్ ఉంటే, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad