Budhas Hand Fruit Health Benefits: ప్రపంచంలో మనకీ తెలియని ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. అందులో బుద్ధ హస్తం ఒకటి. దీనినే ‘బుషుకాన్’ అని కూడా పిలుస్తారు. ఇది చూడటానికి విచిత్రంగా ఉంటుంది. ఈ పండు మన చేతి వేళ్ల ఆకారంలో కనిపిస్తుంది. పైగా ఇది ఒక సిట్రస్ పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని రంగు నిమ్మ పండు తొక్క కలర్ లో ఉంటుంది. ఇది మంచి సువాసనను కూడా ఇస్తుంది. ఇది అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
బుద్ధ హస్తం ఫ్రూట్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా విటమిన్ సితోపాటు ఫైబర్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండు తింటే అజీర్తి, మలబద్దకం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలకు చిటికెలో చెక్ పెట్టొచ్చు. దీనికి ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె జబ్బులు, క్యాన్సర్లు వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. మీ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, తద్వారా దీనిని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరగటంతో ఇన్ఫెక్షన్ల మీ దరి చేరవు. దీనిని తీసుకోవడం వల్ల రెగ్యూలర్ గా వచ్చే జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు రావు. ఈ పండ్లు హైబీపీని తగ్గిస్తాయి. మహిళలు పీరియడ్స్ టైంలో ఈ పండ్లు తినడం వల్ల వారి నొప్పులు తగ్గుతాయి.
ఈ బుద్ధ హస్తం పండు కౌమారిన్, లైమోనిన్, అనాల్జెసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే సహజమైన ఈ గుణం నొప్పులతోపాటు వాపులను సైతం తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మోకాళ్ల నొప్పులు తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడిని దూరం చేసి.. మైండ్ ను రిలాక్స్ గా ఉంచుతుంది. మీ శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది.