Dibetes VS Non-Veg: ఇప్పటి కాలంలో డయాబెటిస్ అనేది చాలా సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యగా మారింది. ఈ వ్యాధిలో శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వలన రక్తంలో చక్కెర స్థాయులు అధికమవుతాయి. శాశ్వతంగా నయం చేసే చికిత్స ఇప్పటివరకు లేకపోయినా, జీవనశైలిలో మార్పులు చేయడం, ఆహార అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ప్రాథమికంగా ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, మరియు సమయానికి వైద్య పరీక్షలను పాటించాలి.
భారతదేశంలో చాలా మందికి నాన్ వెజ్ అంటే ఇష్టం. వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో చికెన్ లేదా మటన్ తినడం అనేది చాలామందికి ఆనందంగా ఉంటుంది. కానీ మధుమేహం ఉన్నవారు తినే మాంసం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతుంది. అందువల్ల మటన్, చికెన్ రెండింటిలో ఏది తీసుకోవాలి, ఏది ఆరోగ్యానికి బెటర్ అన్న సందేహం చాలా మందికి ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/lifestyle/harvard-study-finds-lithium-deficiency-link-to-alzheimer-disease/
వైద్య నిపుణుల సూచన ప్రకారం, మాంసం రకం, అందులో ఉండే పోషకాలు, కొవ్వు శాతం, వంట విధానం ఇవన్నీ కలిపి చూడాలి. దీనిలో రెడ్ మీట్ గురించి ముందుగా చూద్దాం.
రెడ్ మీట్ లక్షణాలు
పంది, గొడ్డు, గొర్రె, మేక మాంసాలు అన్నీ రెడ్ మీట్‌గా భావిస్తారు. మన దేశంలో మటన్ అంటే సాధారణంగా గొర్రె లేదా మేక మాంసాన్నే సూచిస్తారు. మటన్‌లో ఐరన్, జింక్, ఫాస్ఫరస్, విటమిన్ బి12 వంటి విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీంట్లో సంతృప్త కొవ్వులు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. సంతృప్త కొవ్వులు ఎక్కువగా తింటే.
మటన్‌లో ఉండే సోడియం, నైట్రేట్లు శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీని వలన టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరగవచ్చు. అలాగే కొన్ని పరిశోధనల్లో రెడ్ మీట్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందని సూచించబడింది. అయినప్పటికీ, మేక మాంసం మిగతా రెడ్ మీట్‌లతో పోలిస్తే కొంత సురక్షితంగా భావించబడుతుంది. ఇందులో సోడియం కంటే పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి కొంత మంచిదే. కానీ, దీనిని కూడా పరిమిత మోతాదులోనే తినాలి.
చికెన్‌లోని ప్రయోజనాలు
చికెన్ అనేది ప్రోటీన్‌కు మంచి మూలం. అందుకే ఆరోగ్యంపై దృష్టి పెట్టేవారు, వ్యాయామం చేసే వారు దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. అమెరికా వ్యవసాయ శాఖ (USDA) వివరాల ప్రకారం, 100 గ్రాముల చికెన్‌లో సుమారు 143 కేలరీల శక్తి ఉంటుంది. అదే మోతాదులో 24 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కంటే తక్కువ కొవ్వు, కొద్దిగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అదనంగా కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ A, విటమిన్ C కూడా లభిస్తాయి.
చికెన్‌లో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల, మధుమేహం ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దీని గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువగా ఉంటుంది. అంటే చికెన్ తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. సరైన పద్ధతిలో ఉడికించడం లేదా గ్రిల్ చేయడం వంటి ఆరోగ్యకరమైన వంట విధానాలు పాటిస్తే చికెన్ డయాబెటిస్ రోగులకు మంచి ఆహార ఎంపికగా మారుతుంది.
మటన్ vs చికెన్ – డయాబెటిస్ పేషంట్స్ కోసం
మటన్ రుచికరమైనదే కానీ ఇది రెడ్ మీట్ కిందకి వస్తుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తినడం మధుమేహం ఉన్నవారికి అనుకూలం కాదు. పరిమిత మోతాదులో, మంచి వంట విధానంతో తీసుకుంటే పెద్దగా హాని ఉండకపోవచ్చు. మరోవైపు చికెన్‌లో కొవ్వు తక్కువ, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని నిస్సంకోచంగా తినవచ్చు. అయినప్పటికీ వేపడం లేదా అధిక నూనె ఉపయోగించడం తగ్గించి, ఉడకబెట్టి లేదా గ్రిల్ చేసి తినడం మంచిది.
వైద్యుల సూచన
డాక్టర్లు సూచిస్తున్నట్లుగానే, మధుమేహం ఉన్నవారు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మటన్ తినాలి. మిగతా రోజుల్లో చికెన్ లేదా చేపలు వంటి ఆరోగ్యకరమైన మాంసం తీసుకోవడం మంచిది. అలాగే మాంసం వండేటప్పుడు అధిక ఉప్పు, నూనె, మసాలాలు వాడకూడదు. కూర లేదా గ్రేవీ చేస్తే, ముందు మాంసాన్ని బాగా ఉడకబెట్టి, తరువాతే వంట చేయడ.


