సాధారణంగా ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని ఆనంద పరిస్తే.. మరికొన్ని భయపెట్టే కలలు ఉంటాయి. అయితే భయంకరమైన కలలు కన్నప్పుడు ఆందోళన పడుతూ చాలా మంది లేస్తుంటారు. కొద్ది సేపటి తర్వాత వారిని ఏమయ్యిందని అడిగితే మాత్రం సరిగ్గా చెప్పలేము. ఏదో కలొచ్చింది.. కానీ ఏం వచ్చిందో సరిగ్గా చెప్పడం సాధ్యపడదు. అయితే కలవర పెట్టే కలలను ఎందుకు మర్చిపోతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చాలా మంది నిద్రలో ఏదో అంటూ ఉలిక్కిపడుతుంటారు కలవరిస్తారు. అయితే వారిని నిద్రలోంచి లేపి.. ఏమైందని అడిగితే మాత్రం ఏ జరుగనట్టు, ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తారు. అసలు వాళ్లకు ఆ కల గుర్తుండదు. అది వాళ్ల తప్పు కాదు. మెదడు ఆ కలను గుర్తు పెట్టుకోలేదన్నమాట. తాజాగా హార్వర్డ్ మెడికల్ స్కూల్ చేసిన రీసెర్చ్ అసలు కలలెందుకు మర్చిపోతామన్న అంశం మీద ఆసక్తికర విషయాలు తెలిపాయి అవేంటో చూద్దాం. నిపుణులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారి ఆలోచనా విధానాన్ని బట్టి కలలు వస్తాయట. కొన్ని కలలు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు, పరిస్థితులను ముందే హెచ్చరిస్తాయట. మరికొన్ని కలలేమో మన ఆందోళన, భయం నిజమైతే ఎలా ఉంటుందో అదే కల రూపంలో వచ్చి భయపెడతాయట. అందుకే అలాంటి కలలు చాలావరకు గుర్తుండవు అంటున్నారు.
కొన్నిసార్లు ఎప్పుడు వచ్చిన కలలు కూడా చాలాకాలం వరకు గుర్తుండిపోతాయి. కొన్ని కలలు మాత్రం నిద్రలోంచి లేచిన మరుక్షణమే మరిచిపోతాం. అలాంటి కలలే మన జీవితంలో నిజమవుతాయట. ఆ కలలు నిజమైన సందర్భంలో ఆ ఘటన అంతకు ముందే ఎవరికో జరిగినట్టు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందంట. కానీ మనకే కల వచ్చిన సంగతి మాత్రం అస్సలు గుర్తు రాదట. దీనికి కారణం మన మెదడు అడ్వాన్స్ గా రాబోయే కాలంలో ఏం జరగబోతుందో కచ్చితంగా ఊహించలేదు. ఒకవేళ ఊహించినా దాన్ని గుర్తు పెట్టుకోలేదు. సైన్స్, టెక్నాలజీ విషయంలో ఇది వర్తించదు. మనం ఆలోచించే విషయాలు, మన జీవితం గురించిన అంశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధ్యయనంలో తేలింది.
సైన్స్ ప్రకారం కలలు గుర్తుండకపోవడమనేది పెద్ద రహస్యమేమీ కాదు. అదొక మానసిక అచేతన స్థితి. దీన్ని అటోనియా అంటారు. నిద్ర అనేది మనం భావించే దానికన్నా క్లిష్టమైనది. శరీరాన్ని సుప్తచేతనావస్థలోకి చేర్చడం. మెదడును మెలకువగా ఉంచి… శరీరాన్ని నిద్రకు, మెలకువకు ఊగిసలాడించే ఒక ప్రక్రియ. దీన్ని సైన్స్ పరిభాషలో రెమ్ అంటారు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మెలకువగా ఉన్నట్టే ఉంటుంది. కళ్లు వేగంగా కదులుతాయి. రక్తప్రసరణలో, శ్వాస ప్రక్రియలో గణనీయమైన మార్పులుంటాయి. ఈ సమయంలో తరచుగా మన జీవితంలో జరిగే పరిణామాలను కలల రూపంలో మనం మేల్కొనే సమయం వరకు అంగీకరిస్తాం. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన మరుక్షణమే శరీరం యాక్టివ్ అవుతుంది. అందుకే ఆ కల ఏమాత్రం గుర్తుండదు.
ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా గుర్తు పెట్టుకునేందుకు మెదడులో ఒక కీలకమైన రసాయనం పనిచేస్తూ ఉంటుంది. అది కలల విషయంలో కూడా వర్తిస్తుంది. ఆ రసాయనమే నోరాడ్రినలిన్. శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేస్తూ, యాక్టివ్గా ఉంచే హార్మోన్ ఇది. గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే కలలు గుర్తుండవని నిపుణులు చెపుతున్నారు. (గమనిక : ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)