Saturday, November 15, 2025
Homeహెల్త్Butter Milk: రోజూ మజ్జిగ తాగితే శరీర బరువు తగ్గుతుందా..?

Butter Milk: రోజూ మజ్జిగ తాగితే శరీర బరువు తగ్గుతుందా..?

Butter Milk Benefits: పలచటి మజ్జిగను రాత్రి పడుకోబోయేముందు తాగితే బరువు తగ్గుతారట. ఇది ఆశ్చర్యకరంగా అనిపించినా! ఇది నిజం. మజ్జిగలో ప్రొబయొటిక్స్ బాగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇందులో కాలరీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మజ్జిగ జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది కూడా. క్రేవింగ్స్ ను సైతం మజ్జిగ తగ్గించడమే కాదు మంచి నిద్ర వచ్చేట్టు చేస్తుంది. ఇన్ని ముఖ్య ప్రయోజనాలు ఉన్న మజ్జిగ బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

- Advertisement -

అలాంటి మజ్జిగను రాత్రి నిద్రపోవడానికి కనీసం అరగంటముందు తీసుకుంటే శరీర బరువు తగ్గుతుందని నిపుణులు చెపుతున్నారు. అందుకే మజ్జిగ కేవలం సమ్మర్ డ్రింకు మాత్రమే కాదు..ప్రొబయొటిక్ సుగుణాలను అందించే సహజసిద్ధమైన డ్రింకు. పాలను తోడిపెడితే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలికి అందులో తగినన్ని నీళ్లు, మసాలా దినుసులు కలిపి అది మజ్జిగ అవుతుంది. మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి12, రిబోఫ్లావన్ వంటి పోషకాలు బోలెడు ఉంటాయి. అయితే 100 ఎంల్ మజ్జిగలో దాదాపు 46.4 కాలరీలు, 7.12 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ఒక గ్రాము ఫ్యాట్, 3.3 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి.

Also Read: Health Tips: మీ బీపీ కంట్రోల్‌ కావడం లేదా..అయితే ఓ చెంచాడు యాలకుల పొడి చాలు!

మజ్జిగ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది గట్ హెల్త్ ను క్రమబద్ధం చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. జీవక్రియను పెంపొందిస్తుంది. ఇక మజ్జిగ బరువును ఎలా తగ్గిస్తుందంటారా? మజ్జిగ వెయిట్ మేనేజ్మెంట్ లో బాగా ఉపయోగపడుతుందనే విషయాన్ని పోషకనిపుణులు చెప్పడమే కాదు..పలు స్టడీల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. మజ్జిగలో లాక్టోబాసిలస్ ఎసిడోఫిలస్, బిఫిడోబాక్ట్రియం బిఫిడం ఉంటాయి. ఈ గుడ్ బాక్టీరియా జీర్ణక్రియను బాగా జరిగేట్టు తోడ్పడతాయి. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ఆకలి, కడుపునిండుగా ఉండడం వంటి వాటిని కలిగించే హార్మోన్లు ఆకలి ఫీలింగును తొందరగా కలగనివ్వవు. అంతేకాదు అర్థరాత్రుళ్లు క్రేవింగ్ సైతం అనిపించదు. మజ్జిగలో ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయమే పడుతుంది. ఫలితంగా ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో రోజులో తీసుకునే కాలరీ ఇన్టేక్ కూడా బాగా తగ్గుతుంది.

మజ్జిగలోని ప్రొటీన్లు, కాల్షియం వల్ల కడుపు నిండగా ఉండి అర్థరాత్రి క్రేవింగ్స్ తగ్గుతాయి. అంతేకాదు మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఎమినోయాసిడ్ నిద్రను క్రమబద్ధంచేస్తుంది. మంచి నిద్రపోతే హార్మోన్ల సమతుల్యత కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత బాగుంటే బరువు సులభంగా తగ్గుతాం.నిద్రసరిగా పట్టకపోతే స్ట్రెస్ హార్మోన్ కోర్టిసాల్ ప్రమాణాలు పెరిగి శరీరంలో ఫ్యాట్ బాగా ఎక్కువవుతుంది. మరీముఖ్యంగా పొత్తికడపుచు ట్టూరా ఫ్యాట్ ఎక్కువ చేరుతుంది. అంతేకాదు అన్నం తిన్నతర్వాత తీసుకునే మజ్జిగ మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేలా ఎంతో తోడ్పడుతోంది. అందులోనూ మజ్జిగలో జీలకర్ర, మిరియాలు, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే జీర్ణక్రియ మరింత బాగా జరుగుతుంది.

 

Also Read: Health Tips: క్యారట్ సలాడ్ తో మెరిసే చర్మం మీ సొంతం..

మజ్జిగ తాగడం వల్ల శరీరం మరిన్ని ప్రయోజనాలును కూడా పొందుతుంది. మజ్జిగలో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్ ల వల్ల ఎముకల సాంద్రత బాగా ఉంటుంది. అంతేకాదు..కీళ్లు ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా మజ్జిగ ఎంతో బాగా పనిచేస్తుంది. ఎక్కువ ఫ్యాట్ లేకుండా బలమైన ఎముకలు కావాలనుకునే వాళ్లకు మజ్జిగ దివ్యౌషధం. మజ్జిగలో నీరు ఎక్కువగా ఉండడం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ ఉండడం వల్ల శరీరాన్ని మజ్జిగ చల్లబరుస్తుంది. అంతేకాదు..డీహైడ్రేషన్ బారిన పడకుండా సంరక్షిస్తుంది.

ముఖ్యంగా వేసవిలో మజ్జిగ తాగడం ఎంతో మంచిది. మజ్జిగలో కొలెస్ట్రాల్, ఫ్యాట్ లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మజ్జిగ రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో తోడ్పడతుంది. మజ్జిగ తాగినా ఎంతో లైట్ గా అనిపిస్తుంది. తప్ప ఆకలి వేయదు. క్రేవింగ్స్ ఉండవు. అంతేకాదు..ఫ్యాట్ ఎక్కువగా ఉండే డయిరీ ఉత్పత్తులకు మంచి ప్రత్యామ్నాయంగా కూడా మజ్జిగను పోషకాహారనిపుణులు సూచిస్తారు.

మజ్జిగలోని ప్రొబయొటిక్ పదార్థాల వల్ల, బి-విటమిన్స్ వల్ల మజ్జిగ రోగనిరోధకశక్తిని ద్రుఢం చేస్తాయి. గట్ హెల్త్ ను సంరక్షిస్తుంది. గట్ హెల్త్ కు, రోగనిరోధకవ్యవస్థకు పరస్పరం ఎంతో దగ్గర సంబంధం ఉంది. రోగనిరోధకవ్యవస్థను మజ్జిగ బలోపేతం చేస్తుంది. రిబోఫ్లావిన్, విటమిన్ –ఎ వంటి పోషకాలను ఇది అందిస్తుంది. ఇన్ఫెక్షన్లను పోగొట్టడంలో ఇవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.

Also Read: Health tips: ఆడవారికి గడ్డం కింద వెంట్రుకలు ఎందుకొస్తాయి? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి!

మజ్జిగను తాగడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మెరుపులు చిందిస్తుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేయడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. సూర్యతాపం ప్రభావం పోయేందుకు కూడా దీన్ని తమ డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో చాలామంది వాడతారు. పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా మజ్జిగ ఉపయోగ పడుతుంది. చర్మం టెక్స్చెర్ ను మెరుగుపరుస్తుంది.

తరచుగా మజ్జిగ తాగడం వల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకు పోతాయి. అందుకే వేసవిలో మజ్జిగను చాలామంది తప్పకుండా తాగుతుంటారు. అంతేకాదు స్పైసీ ఫుడ్ తిన్నతర్వాత కూడా మజ్జిగను తప్పకుండా తాగుతారు. శరీరం లోపలి అంతర్గత సమతుల్యతను కూడా మజ్జిగ సంరక్షిస్తుంది. శరీరానికి సుఖాన్ని అందిస్తుంది. అయితే లాక్టోస్ పడనివాళ్లు మజ్జిగ వాడకూడదు. వాళ్లు కనుక మజ్జిగను తాగితే కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కొంటారు. ఫ్లేవర్డ్ , సుగర్ , ప్రిజర్వేటివ్స్ కలిపిన మజ్జిగ డ్రింకులను తాగొద్దు. ఆరోగ్యానికి మంచిది కదా అని మజ్జిగ అతిగా తాగితే ఇబ్బందే. అందుకే మజ్జిగను కూడా మోడరేట్ గా తీసుకోవాలి. నిద్రపోయవడానికి కనీసం అరగంట ముందు మజ్జిగ తాగాలి. ఇలా నిత్యం చేయడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad