Saturday, November 23, 2024
Homeహెల్త్Winter and Chiku: చలికాలంలో సపోటాతో చర్మం మరింత అందంగా

Winter and Chiku: చలికాలంలో సపోటాతో చర్మం మరింత అందంగా

సపోటా రుచుల్లో పోషకాలు మెండు

సపోటా పండు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆ పండు తీపిదనంలోనే ఒక స్పెషాలిటీ ఉంది. చిక్కూ అదేనండి సపోటా పండు. జ్యూసును తాగినా చాలు కడుపు నిండుగా ఉండి ఆకలి ఒక పట్టాన వేయదు. అంతేకాదు చీకూ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహారనిపుణులు. సపోటా తీపి ఎంతో బాగుండడమే కాదు వెయిట్ లాస్ కు కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకు కారణం ఈ పండులో అధికపాళ్లల్లో పీచుపదార్థాలు ఉండడమే. అందుకే వీటిని తింటే తొందరగా ఆకలి వేయదు. బింజ్ ఈటింగ్ చేయము. అలా బరువు తగ్గడానికి ఈ పండు ఎంతగానో ఉపయోగపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

అంతేకాదు జీర్ణసంబంధ సమస్యలను కూడా సపోటా పోగొడుతుందంటున్నారు. ఈ పండులోని ఫైబర్, విటమిన్లు, యాంటాక్సిడెంట్లు అధికంగా ఉన్నాయని తెలిసినపుడు ఈ పండు ఆరోగ్యానికి ఎంతటి సూపర్ హీరోనో మరింత అర్థమవుతుందని నిపుణులు చెపుతున్నారు. చిక్కు పండు వాపును, మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు వర్కవుట్లు చేసిన తర్వాత ఒంట్లో ఎనర్జీ పోయినట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు సపోటా పండు ఒకటి తిన్నారనుకోండి మీ ఎనర్జీ లెవల్స్ వేరే స్థాయిలో ఉంటాయి. ఆ పండులోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తిని ఇవ్వడమే కాదు మీ జీవక్రియను సైతం ఎంతగానో మెరుగుపరుస్తుంది. అంతేకాదు శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

ఈ పండులో యాంటాక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో సపోటా శరీరాన్ని సీజనల్ అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది కూడా. పైగా సంవత్సరం పొడుగుతా మీ చర్మం కాంతివంతంగా మెరిసేలా కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో సపోటా వల్ల చర్మం సురక్షితంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ పండులో విటమిన్ ఇ, ఎ, సిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని సహజసిద్ధమైన మెరుపును కలిగి ఉండేలా చేస్తాయి. చర్మానికి కావలసినంత హైడ్రేషన్ ను, మాయిశ్చరైజర్ ని అందివ్వడమే కాదు చర్మం పొడిబారడమన్న సమస్యే ఎదురవదు. యాంటి ఏజింగ్ కాంపౌడ్లు కూడా ఈ పండులో అధికంగా ఉన్నాయి. చర్మ సంబంధమైన వాపు, నొప్పులు, మంటను కూడా సపోటా తగ్గిస్తుంది.

సపోటా నూనె ఈ సమస్యలను మరింత శక్తివంతంగా పరిష్కరిస్తుంది. కంటి సమస్యలు ముఖ్యంగా చూపుకు రక్షణ కవచంలా సపోటా పనిచేస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది కంటి చూపు ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆరోగ్యవంతమైన శిరోజాలకు అవసరమైన ఎసెన్షియల్ న్యూట్రియంట్లు అన్నీ సపోటా పండులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సపోటా పండు కన్నా కూడా సపోటా సీడ్ ఆయిల్ శిరోజాలను ఎంతో బాగా ఆరోగ్యంగా ఉంచుతాయి. సపోటా గింజల నుంచి తయారచేసిన ఆయిల్ జుట్టుకు కావలసిన మాయిశ్చరైజర్ ని అందించడమే కాదు జుట్టును సిల్కీగా కూడా ఉంచుతుంది. ఉంగరాల జుట్టు వారికి సపోటా సీడ్ ఆయిల్ అందించే ప్రయోజనాలు ఎన్నో. దురద సమస్యలను అంటే సెబొరిక్, డెర్మటైటిస్ వంటి స్కిన్ సమస్యలపై బాగా పనిచేయడమే కాదు ఆరోగ్యవంతమైన శిరోజాల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది కూడా. సపోటా సీడ్ ఆయిల్ తో మరిన్ని ఎక్కువ ఫలితాలు పొందాలంటే సపోటా సీడ్ ఆయిల్ లో కొద్దిగా ఆముదం కలిపి పేస్టులా చేసి దాన్ని మాడుకు రాసుకుని మరుసటి రోజు శుభ్రంగా తలను కడుక్కోవాలి.

ఈ పండులో కాల్షియం, ఫాస్ఫరస్ , ఐరన్ అధికంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడతాయి. నిత్యం ఈ పండు తింటే పెద్ద తనంలో ఎముకల బలానికి ఎలాంటి సప్లిమెంట్లు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు పోషకాహారనిపుణులు. ఈ పండులోని ఎసెన్షియల్ మినరల్స్ వల్ల శరీరంలోని వివిధ అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. అంతేకాదు ఎముకలను ఈ పండ్లు ద్రుఢంగా ఉండేలా చేస్తాయి. సపోటాలో కార్బోహైడ్రేట్లు, ఎసెన్షియల్ న్యూట్రియంట్లు పుష్కలంగా ఉండడం వల్ల కాబోయే అమ్మలకు ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని కూడా చెపుతున్నారు .గర్భిణీలకు ఈ పండు ఇచ్చే ఎనర్జీ ఎంతోనంటున్నారు. గర్భిణీలకు ఉండే వికారం, తలతిప్పడం, బలహీనత వంటి సమస్యలను ఈ పండు తగ్గిస్తుందని చెపుతున్నారు.


చీకూలో యాంటాక్సిడెంట్లు కూడా బాగా ఉన్నాయి. అందుకే వీటి వల్ల కాన్సర్ రిస్కు తక్కువగా ఉంటుందని వైద్యనిపుణులు చెపుతున్నారు . ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ల రిస్కును ఈ పండ్లు తగ్గిస్తాయంటున్నారు. ఈ పండులో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి పెద్ద ప్రేవు కాన్సర్ బారిన పడమని అంటున్నారు.

సపోటాలో రెండు ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. అవే పొటాషియం, మెగ్నీషియం. ఇవి శరీరారోగ్యానికి, అలాగే రక్తపోటు తగ్గించడానికి ఎంతో అవసరం. వీటిల్లోని కెమికల్, ఫిజికల్ అంశాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News