Monday, July 8, 2024
Homeహెల్త్Winter diet: చలిలో ఇవి మస్ట్ గా తినండి

Winter diet: చలిలో ఇవి మస్ట్ గా తినండి

పోషకాహారం తీసుకోవటం ఈ సీజన్ లో చాలా అవసరం

శీతాకాలం డైట్ లో ఇవి ముఖ్యం..

- Advertisement -

చలికాలంలో తినాల్సిన పండ్లు, కూరగాయలు కొన్ని ఉన్నాయి. పైగా శీతాకాలంలో హెల్దీ డైట్ తప్పనిసరిగా తీసుకోవాలి కూడా. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలతో కూడిన వింటర్ డైట్ ప్రతి ఒక్కరికీ అత్యావశ్యకం. సరైన మోతాదులో పోషకాలు శరీరానికి అందకపోతే బలహీనపడతారు. దీంతో సులువుగా రకరకాల జబ్బుల బారిన పడతారు కూడా. అందుకే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పిండిపదార్థాలు ఉండే డైట్ ను ఈ సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే శరీర క్రియలన్నీ సరిగా జరగుతాయి. పోషక పదార్థాలతో కూడిన డైట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. అందుకే నిత్యం పోషకాలతో కూడిన సమతులాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.

పైగా సీజన్ మారినపుడల్లా ఆ ప్రభావం మన రోగనిరోధక వ్యవస్థ మీద కూడా పడుతుంది కాబట్టి ఆహారం
విషయంలో అన్ని సీజన్లలోనూ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక శీతాకాలంలో తినాల్సిన పండ్లు, కూరగాయలు కొన్ని ఉన్నాయి. వాటిని తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. ఫలితంగా ఈ సీజన్ లో ఎలాంటి జబ్బుల బారిన తొందరగా పడరు. శీతాకాలంలో బాగా దొరికే ఆకుకూర పాలకూర. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. పైగా ఈ ఆకుకూర యాంటాక్సిడెంట్ల నిధి కూడా.

చలికాలంలో పాలకూర తినడం వల్ల శరీర ఫిట్నెస్ బాగుండడంతో పాటు తొందరగా ఎలాంటి జబ్బుల బారిన పడరు. చలికాలంలో బీన్స్ తింటే కూడా ఎంతో మంచిది. వీటిల్లో ఐసేన్ అనే ఎసెన్షియల్ అమినో యాసిడ్ పుష్కలంగా ఉంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు పాలకూరలో ఫోలేట్ మిశ్రమాలతో పాటు విటమన్ బి, ఫైబర్, ప్రొటీన్లు బాగా ఉంటాయి. చలికాలంలో చాలామంది ఇష్టంగా తినే కూరగాయ
చిలకడదుంపలు. శరీరంలో ఎనర్జీ ప్రమాణాలు సుస్థిరంగా ఉంచే పీచు పదార్థాలు, విటమిన్ ఎ, బీటాకెరొటెన్, పొటాషియంలు చిలకడదుంపల్లో పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ కూడా శీతాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయ.

ఇందులో విటమిన్ ఎ అత్యధికంగా ఉంటుంది.అలాగే బీటా కెరొటినా, విటమిన్ సి, విటమిన్ కె, డైటరీ ఫైబర్లు క్యారెట్లో అధికం.తక్కువ కాలరీలు తినాలనుకునే వారికి ఇది ఎంతో మంచిది. బరువు తగ్గడానికి సైతం క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. శీతాకాలంలో మీ శరీరాన్ని ఇవి ఎంతో ఆరోగ్యంగా
ఉంచుతాయి. మెంతాకులో పోషకవిలువలు పుష్కలం.అంతేకాదు ఇందులో కాల్షియం,ఐరన్, ప్రొటీన్, ఫాస్ఫరస్, విటమిన్లు కూడా అధికం. మెంతాకును వింటర్ డిషెస్ లో తప్పనిసరిగా వాడతారు. ఈ ఆకు శరీరారోగ్యాన్ని ఎంతో నిలకడగా ఉంచుతుంది. శీతాకాలంలో తినాల్సిన పండ్లల్లో యాపిల్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు ఈ పండులో పెక్టిన్, ప్రొటీన్, విటమిన్ సి, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఈ సీజన్ లో శరీరారోగ్యానికి యాపిల్ ఎంతో మంచిది కూడా. పియర్ పండు కూడా ఈ సీజన్ లో తప్పనిసరిగా తినాల్సినది. ఈ పండులో విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటాక్సిడెంట్లు అధికం. ఈ పండు
రోగనిరోధకశక్తిని పెంచడమే కాదు చలికాలంలో ఎలాంటి జబ్బుల బారిన పడకుండా సంరక్షిస్తుంది
కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News