Sunday, October 6, 2024
Homeహెల్త్Wrinkles: కొబ్బరి నూనెతో ముడతలు మాయం

Wrinkles: కొబ్బరి నూనెతో ముడతలు మాయం

ఫ్రీరాడికల్స్ ను నశింపచేసి,. ముడతలను పోగొట్టి చర్మాన్ని తళ తళ మెరిసేలా..

కొబ్బరినూనెతో ముఖంపై పడ్డ ముడతలు పోగొట్టుకోవచ్చు. ఈ నూనె రాసుకోవడం వల్ల చర్మం ఎంతో మ్రుదువుగా, మరింత అందంగా తయారవుతుంది కూడా. ముఖంపై ఏర్పడ్డ ఫైన్ లైన్స్ సైతం పోతాయి. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ముడతలు పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. మొదట ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఆతర్వాత టవల్ తో ముఖాన్ని బాగా పొడిగా తుడుచుకోవాలి. అనంతరం కొన్ని చుక్కల వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని తీసుకుని ముఖంపై, మెడ భాగంలో వేళ్లతో వ్రుత్తాకారంలో కొన్ని నిమిషాల సేపు మర్దనా చేసుకుని అలాగే రాత్రంతా ఉంచుకోవాలి. ఇలా ప్రతి
రోజూ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. కొబ్బరినూనె చర్మాన్ని మెరిపిస్తుంది. ఫ్రీరాడికల్స్ ను నశింపచేస్తుంది. ముడతలను పోగొట్టి చర్మాన్ని తళ తళ మెరిసేలా చేస్తుంది. చర్మానికి కావలసినంత మాయిశ్చరైజర్ ని అందివ్వడమే కాకుండా పట్టులా ఉంచుతుంది. ఇందులో సహజసిద్ధంగా ల్యూరిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్లు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మ్రుదువుగా చేస్తాయి.

- Advertisement -

ముఖంపై ఉండే ముడతలు పోవడానికి మరో చిట్కా కూడా ఉంది. యాపిల్ సిడార్ వెనిగర్, కొబ్బరినూనె కలిపి రాసుకుంటే కూడా చర్మంపై ఏర్పడ్డ ముడతలు పోతాయి. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు, కొన్ని చుక్కల వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఒక కాటన్ బాల్ రెడీగా పెట్టుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్లో నీటిని కలిపి పలచగా చేసి కాటన్ బాల్ ను అందులో ముంచి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టేలా రాయాలి. అది బాగా ఆరిన తర్వాత కొబ్బరి నూనెతో ముఖాన్ని మర్దనా చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ లోని ఎసిడిటీ చర్మంలోని పిహెచ్ ప్రమాణాలను సమతుల్యం చేసి స్కిన్ టోన్ ను పరిరక్షిస్తుంది.

కొబ్బరినూనె, ఆముదం నూనె మిశ్రమాన్ని ముఖానికి రాసుకన్నా కూడా ముడతలు పోతాయి. రెండు మూడు చుక్కల ఆర్గానిక్ కొబ్బరినూనెలో రెండు లేదా మూడు చుక్కల ఆముదం నూనెను కలిపి ఆ మిశ్రమంతో ముఖాన్ని సున్నితంగా మర్దనా చేసి దాన్ని అలాగే రాత్రంతా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు తొందరగా పోతాయి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖంపై ముడతలు తొందరగా ఏర్పడవు కూడా. ఆముదం నూనె చర్మంపై డీప్ కండిషనర్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటాంక్సిండెంట్లతో పాటు యాటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని పట్టులా ఉంచుతాయి. మిమ్మల్ని యంగ్ గా కనిపించేలా చేస్తాయి. ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ అస్సలు ఏర్పడవు. మరొక చిట్కా ఏమిటంటే విటమిన్ ఇ, కొబ్బరినూనె కలిపి ముఖానికి పట్టిస్తే కూడా ముఖంపై ఏర్పడ్డ ముడతలు పోతాయి.

ఇందుకోసం ఒక విటమిన్ కాప్స్యూల్, కొన్ని చుక్కల ఆర్గానిక్ కొబ్బరినూనె తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. విటమిన్ ఇ కాప్స్యూల్ ని చిన్న బౌల్ లో పిండి అందులో కొబ్బరినూనెను కలపాలి. దాన్ని ముఖంపై కొన్ని నిమిషాల పాటు బాగా మర్దనా చేయాలి. ఇలా రోజూ చేయొచ్చు. విటమిన్ ఇ కాప్స్యూల్స్ చర్మానికి కావలసిన హైడ్రేషన్ ను అందిస్తుంది. స్కిన్ టోన్ సమానంగా ఉండేలా చేస్తుంది. చర్మంపై ఉండే అనారోగ్యకరమైన పొడిబారే గుణాన్ని పోగొడుతుంది. ఈ డ్రైనెస్ కారణంగానే ముఖంపై ముడతలు, సన్నని లైన్స్ ఏర్పడతాయి. ఇందులో టొకోఫిరోల్ అనే యాంటాక్సిడెంటు ఉంటుంది. ఇది చర్మాన్ని ఉత్తేజితం చేస్తుంది.

కాంతి విహీనంగా ఉన్న చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరినూనె, తేనె కాంబినేషన్ ముఖానికి పూసుకుంటే కూడా ముఖంపై ఏర్పడ్డ ముడతలు పోతాయి. ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ కొబ్బరినూనె, అర టీస్పూను ముడి తేనె తీసుకోవాలి. రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని దెబ్బతిన్న ప్రాంతంలో రాసి ఒక గంట వరకూ అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. రోజుకొకసారి ఇలా చేస్తే చాలు. తేనెలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న చర్మానికి సాంత్వన నిస్తాయి. దీంతో ముఖంపై ఏర్పడ్డ ముడతలు పోతాయి. అంతేకాదు చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి కూడా. కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్నా కూడా ముఖంపై ఏర్పడ్డ సన్నగీతలు, ముడతలు పోతాయి. ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, కొన్ని చుక్కల నిమ్మరసం, ఒక టీస్పూను పచ్చి పాలు తీసుకోవాలి. పచ్చి పాలలో నిమ్మరసం బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో కొబ్బరినూనెను కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా మర్దనా చేయాలి. తర్వాత పదిహేను నిమిషాల పాటు దాన్ని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం బాగా కడుక్కోవాలి. దీన్ని నిత్యం ముఖానికి అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసం చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అంతేకాదు చర్మరంధ్రాలు బిగువుగా ఉండేలా చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అది చర్మం యొక్క ఎలాస్టిసిటీని పెంచుతుంది. ముడతలను తగ్గిస్తుంది. అతినీలలోహితకిరణాల వల్ల చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలు, మొటిమలు వంటి వాటిని విటమిన్ సి పోగొడుతుంది. నిమ్మరసం, పాలు, కొబ్బరినూనె మిశ్రమం చర్మానికి కావలసింత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది.

కొబ్బరినూనె, పసుపు మిశ్రమాన్ని ముఖానికి రాసుకున్నా కూడా ముఖంపై ఏర్పడ్డ ముడతలు పోతాయి. ఒక టేబుల్ స్పూన్ వర్జిన్ ఆయిల్, ఒక చిటికెడు పసుపు తీసుకుని ఆ రెండింటిని పేస్టులా కలపాలి. ఆ పేస్టును ముడతలపై రాసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. రోజుకు ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది. పసుపులో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీరాడకల్స్ నుంచి కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అలా చర్మం ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తాయి. ఇందులో యాంటీఇన్ఫ్లమేటర్ గుణాలు కూడా ఉన్నాయి.

కొబ్బరినూనె బ్యూటీ నూనె

 కొబ్బరినూనె కణాలను పునరుద్ధరిస్తుంది.దీంతో ముడతలు తగ్గి చర్మం యవ్వన మెరుపులు చిందిస్తుంది.
 కొబ్బరినూనె బ్యూటీ ఆయిల్. దీన్ని ప్రతిరోజూ రాత్రి పడుకోబోయేముందు రాసుకుంటే చర్మం ఎంతో మ్రుదువుగా తయారవుతుంది. చర్మం బిగువును కోల్పోదు.
 నిమ్మరసం లేదా తేనెతో కొబ్బరినూనెను కలపడం వల్ల యాంటీ ఏజింగ్ ఏజెంటుగా ఈ మిశ్రమం పనిచేస్తుంది.
 కొబ్బరినూనెను కొనేముందు ఎక్సెపెయిరీ తేదీని గమనించుకోవడం మరవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News