భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోవడం ఆందోళనకరం. మనదేశ జనాభాలో 17% మంది ప్రజలు మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్లినిక్ ను శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీతో కలిసి యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, గోరుకంటి రవీందర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు జస్టిస్ ఆర్. దేవదాస్ (కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి), రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, గోరుకంటి రవీందర్ రావు, మాట్లాడుతూ భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం పెరుగుతోంది, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు, వీరిలో కేవలం ఇరవై వేల మంది రోగులకు మాత్రమే కిడ్నీ మార్పిడి అందించబడుతుంది. మిగిలిన వారు డయాలసిస్ లో ఉన్నారని వివరించారు. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో ఈ సీకేడీ సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకోసం ఒక ప్రత్యేక క్లినిక్ ఉండాలనే ఉద్దేశంతో సీకేడీ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్, గోరుకంటి రవీందర్ రావు తెలిపారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజశేఖర చక్రవర్తి, మాట్లాడుతూ సీకేడీ ప్రమాదంలో ఉన్నవారంతా ఈ క్లినిక్ లో తమ పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్ తో సహా ప్రోటోకలైజ్డ్ కేర్, డైటీషియన్ అత్యాధునిక పరికరాలు, మందులను ఉపయోగించి సీకేడీ నిర్వహణకు సలహా ఇస్తారు. సీకేడీ ప్రమాదం ఉన్నవారు డయాబెటిక్ మెల్లిటస్, హైపర్ టెన్షన్, కిడ్నీ స్టోన్స్, దీర్ఘకాలంగా మందులు వాడుతున్న రోగులు (నొప్పి నివారిణి యాంటీబయాటిక్స్ వంటివి), ఊబకాయం ఉన్న వ్యక్తులు, సీకేడీ కుటుంబ చరిత్ర ఉన్న రోగులు కోసం ఈ ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్. రాజశేఖర చక్రవర్తి తెలియజేసారు.