ఇపుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే ఎంతో అందంగా కనిపిస్తారు. మిమ్మల్ని ఎంతో వేగంగా అందంగా కనిపించేలా చేసే ఆ టిప్స్ చెప్పాలంటే చాలానే ఉన్నాయి. వాటిల్లో మాయిశ్చరైజింగ్ తప్పనిసరిగా చేసుకోవడం ఒకటి .
రోజూ మాయిశ్చరైజింగ్ చేసుకుంటున్నాం కదా అని మీరనుకోవచ్చు. కానీ సరిపడినంతగా మీరు మాయిశ్చరైజింగ్ చేసుకొంటే వచ్చే ఫలితాలు ఎంతో బాగుంటాయి. అలాగే మంచి బ్రాండు
మాయిశ్చరైజర్ ని వాడాలి. నిద్రపోయే ముందు మీ కనుబొమలు, కంటిరెప్పలకు గ్రోత్ సెరమ్ అప్లై చేసుకోవాలి. అది మీకిచ్చే అందం ఎంతో. సెరమ్ వాడేటప్పుడు అందులో పెప్టిడెస్, కొల్లాజెన్, బయొటిన్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుని కొనాలి. పొడిచర్మం, బ్రేకవుట్స్ తో తరచూ మీరు బాధపడుతుంటే డ్రై బ్రషింగ్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది చర్మంపై ఉండే మృతకణాలను పోగొడుతుంది. అలా చేయడం వల్ల మీ చర్మం సహజ అందంతో మెరిసిపోతుంది. డ్రై బ్రషింగ్ ఎంతో శక్తివంతమైన ఎక్స్ పొయిలేటింగ్ టెక్నిక్. మీ చర్మానికి యాక్నే సమస్య ఉంటే అది కూడా దీంతో పరిష్కారమయి మీరెంతో అందంగా కనిపిస్తారు.
ఇందుకోసం ముఖానికి, మిగతా శరీరానికి విడి విడిగా మొత్తం రెండు బ్రష్ లు వాడాలి. అలాగే కళ్ల కింద వాపులు, చర్మం సాగినట్టు ఉండడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు మంచి బ్రాండెడ్ ఐ క్రీములు ఎన్నో ఉన్నాయి. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. అలొవిరా, జొజొబా ఆయిల్, తేనె, షియా బటర్ మిశ్రమం కూడా ఈ కంటి సమస్యలను బాగా తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు యాంటి ఏజింగ్ ఏజెంట్ గా ఒక గ్లాసుడు నీళ్లు లేదా ఒక కప్పు హెర్బల్ టీ ఇచ్చే అందం ఎంతో. అలాగే నిత్యం హ్యుమిడిఫైయ్యర్ ఉపయోగించడం వల్ల ముఖం పై ఏర్పడ్డ ఫైన్ లైన్స్, ముడతలు పోతాయి. చర్మం పగుళ్లు కూడా తగ్గుతాయి. దీన్ని రాసుకోవడం వల్ల మీ చర్మం సిల్కీగా తయారవుతుంది. సరైన భంగిమలో నిద్రపోవడం కూడా మీ అందాన్ని రెట్టింపుచేస్తుంది.