Raisin Water Benefits: మహిళలు తరచుగా రక్తహీనతతో బాధపడుతుంటారు. రక్తహీనత కారణంగా రోజంతా అలసటగా అనిపిస్తుంది.ఈ సమయంలో శరీరంలో శక్తి ఎక్కువగా ఉండదు. సోమరితనం ఎక్కువగా ఉంటుంది. అయితే, రక్తహీనతతో బాధపడుతుంటే ఆహారంలో కొన్నిమార్పులు చేసుకుంటే సరిపోతుంది. శరీరంలో రక్తహీనతను అధిగమించడానికి ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో భాగంగా ఎండుద్రాక్షను డైట్ లో చేర్చుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ రక్తహీనతను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. దీనితో పాటు, ఖర్జూరం తినడం ద్వారా రక్తహీనత నయమవుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఎండుద్రాక్ష ఎంతో సహాయపడుతుంది. అయితే, ఇప్పుడు 1 నెల పాటు ప్రతిరోజూ ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రాత్రిపూట నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కాలానుగుణ వ్యాధుల ప్రమాదం నుండి దూరంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలంగా ఉంటె వ్యాధుల దాడి తక్కువగా ఉంటుంది.
నానబెట్టిన ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యలు ఉన్నవారు నానబెట్టిన ఎండుద్రాక్షను తప్పనిసరిగా తమ డైట్ లో చేర్చుకోవాలి.
Also Read: Guava leaves: రోజూ పరగడుపున ఈ ఆకు నమిలితే.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే!
ఎండుద్రాక్ష కాల్షియం మంచి వనరులు. దీని వినియోగం ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎదుగుతున్న పిల్లలకు ఖచ్చితంగా ఎండుద్రాక్షను తినిపించాలి. తద్వారా ఎంతో దృడంగా, బలంగా ఉంటారు.
అధిక రక్తపోటు ఉన్న రోగులు ప్రతిరోజూ నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకుంటే ఎంతో మేలు. ఎండుద్రాక్షలో పొటాషియం కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. నోటి దుర్వాసన ఉన్నవారు కూడా ప్రతిరోజూ నానబెట్టిన ఎండుద్రాక్షను తినాలి. ఎండుద్రాక్ష నోటి ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.
ఎండుద్రాక్ష ఎలా తినాలి?
రాత్రిపూట 10-15 ఎండుద్రాక్షలను కడిగి శుభ్రమైన నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. నీటిలో ఉన్న ఎండుద్రాక్షలను నమిలి తినవచ్చు. ఈ విధంగా ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల చాలా త్వరగా ప్రయోజనం ఉంటుంది.


