Friday, November 22, 2024
Homeహెల్త్Zero calories drinks: జీరో క్యాలరీ డ్రింక్స్ కావాలా నాయనా?

Zero calories drinks: జీరో క్యాలరీ డ్రింక్స్ కావాలా నాయనా?

నో క్యాలరీ, లో క్యాలరీ డ్రింకులు ఇంట్లోనే చేసుకోండి, మార్కెట్లో కొనకండి

తక్కువ కాలరీ డ్రింకులు ఇవే..

- Advertisement -

  డైటింగ్ లో ఉన్నారా? ఈ టైములో తక్కువ కాలరీ డ్రింకులు తాగితే మరింత మంచి ఫలితాలను చూస్తారు. నిజానికి డైటింగ్ చేయడం అంటే నోరుకట్టుకోవడమే.  ఇది చాలా కష్టమైన పనే. ఇక డైటింగ్ లో ఉన్నప్పుడు ఇష్టమైన డ్రింకులు కూడా తాగకుండా ఉండడం కష్టసాధ్యమైన విషయమే. అయితే ఇందుకు బాధపడనవసరం లేదని పోషకాహార నిపుణులు  అంటున్నారు. తక్కువ కాలరీలతో కూడిన డ్రింకులు రుచిలో రారాజులు మాత్రమే కాదు తక్కువ కాలరీలు ఉండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. వీటిని తాగడం వల్ల ఇరవై నాలుగు గంటలూ శరీరం హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా మీ డైటింగ్ ట్రాక్ ను కూడా మిస్ కారు. అంతేకాదు ఈ లో కాలరీ డ్రింకులు మీ బరువును అదుపులో పెట్టడం కూడా ఎంతగానో ఉపకరిస్తాయి. ఇవి వెయిస్ట్ లైన్ ఫ్రెండ్లీ డ్రింకులు కూడా.  

      ఇలాంటి లో కాలరీ డ్రింకుల్లో గ్రీన్ టీ ఒకటి. ఇది రెగ్యులర్ టీకి మంచి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం . ఇందులో డైట్ ఫ్రెండ్లీ పదార్థాలు బోలెడుంటాయి. పైగా ఈ గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పొట్ట చుట్టూ చేరిన కొవ్వును సైతం ఈ టీ కరిగిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాదు తక్కువ కాలరీలనే మనకు అందిస్తుంది. అందుకే గ్రీన్ టీని నిత్యం తాగితే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు.  కీర, కొత్తిమీర జాతి ఆకు పార్స్లే రెండూ కలిపి తయారు చేసిన జ్యూసు మంచి డిటాక్స్ డ్రింకు. కీరకాయలో నీటితో పాటు పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింకు శరీరానికి కావలసిన హైడ్రేషన్ ను అందివ్వడమే కాదు ఈ డ్రింకును తాగితే కడుపు నిండి ఆకలి వేయదు. ఈ డ్రింకు వల్ల కనీస కాలరీలు మాత్రమే శరీరానికి అందుతాయి. పార్స్లే ఆకులో మూత్రవిసర్జన సులువుగా అయ్యేలా చేసే గుణాలు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆకు న్యూట్రిషినల్ పవర్ హౌస్. వీటిల్లో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పోషకాలతో నిండి ఉండి, తక్కువ కాలరీలను అందించే ఈ డ్రింకు వెయిట్ లాస్ లో ఎంతో కీలకం. దీనితో బరువు బాగా తగ్గుతారని పోషకాహార నిపుణులు సైతం చెపుతున్నారు.  

    శరీరంలోని కాలరీలను తగ్గించే మరో డ్రింకు యాపిల్ జ్యూస్ పంచ్. నూరు గ్రాములున్న యాపిల్ లో 50 కాలరీలు ఉంటాయి. కాలరీలను తగ్గించే మరో డ్రింకు ఫ్రూటీ లెమనాయిడ్. లెమనాయిడ్ లో కీలకం నిమ్మకాయలే.  లో కాలరీ లెమనాయిడ్ శరీరానికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి అందే కాలరీలు కూడా తక్కువే. ఈ డ్రింకులో యాంటాక్సిడెంట్లతో పాటు ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఉదయం లేవంగానే గ్లాసుడు నిమ్మకాయ రసం తాగితే జీవక్రియ బాగా జరగుతుంది. అంతేకాదు మొత్తం శరీరారోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది. అయితే సాధారణ నిమ్మకాయ రసానికి ఈ లెమనాయిడ్ ఫ్రూట్ పంచ్ కి కాస్త తేడా ఉంది.  ఈ పంచ్ లో సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు, క్యారెట్ ముక్కలతో పాటు సన్నగా తరిగిన ముల్లంగి, బీట్ రూట్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఈ డ్రింకును తాగితే తక్కువ కాలరీలను మాత్రమే పొందుతాం. ఆహారం బాగా జీర్ణ అవుతుంది. మొత్తం శరీరారోగ్యం బాగుంటుంది.     అస్సలు కాలరీలే లేని డ్రింకు మజ్జిగ. ఇది ఎంతో డైట్ ఫ్రెండ్లీ డ్రింకు. ఇందులో కాలరీలు తక్కువగా, ప్రొబయొటిక్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తాగితే శరీరం సంపూర్ణంగా తేమతో నిండి ఉంటుంది.

మిడ్డే స్నాక్ గా మజ్జిగ తీసుకుంటే మరింత మంచిది. అంతేకాదు వేసవిలో ఇది శరీరానికి తేమను బాగా అందిస్తుంది. కొబ్బరికాయ నీళ్లు మరో సూపర్ డ్రింకు. తక్కువ కాలరీల డ్రింకు కూడా ఇది. మీరు చేయాల్సిందల్లా కొబ్బరి నీళ్లల్లో కాస్తంత నిమ్మరసం, కొన్ని పుదీనా ఆకులు వేయాలి. తీయదనం కోరుకునే వారు అందులో తేనెను కొద్దిగా వేసుకోవచ్చు. ఈ డ్రింకుకు న్యూట్రిషినల్ బూస్ట్ ని కూడా ఇవ్వాలంటే చియా గింజలు లేదా సబ్జా గింజలు అందులో వేస్తే మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఈ డ్రింకులో కూడా కాలరీలు తక్కువ ఉంటాయి. మరో డ్రింకు జల్ జీరా డ్రింకు. ఇందులో తక్కువ కాలరీలు ఉంటాయి. ఈ డ్రింకులు ప్రధానంగా జీలకర్ర గింజలు వేస్తారు. దానితో పాటు పుదీనా, కొత్తిమీర, చింతపండు, అల్లం, పచ్చిమిరపకాయలను కూడా అందులో జోడిస్తారు.

ఈ లో కాలరీ డ్రింకు మనల్ని ఎల్లవేళలా ఎంతో తాజాగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News