Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్China: పిల్లలను కనండి.. నగదు పొందండి..!

China: పిల్లలను కనండి.. నగదు పొందండి..!

China Child Scheme: చైనాలో జనాభా సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతోంది. గత కొన్నేళ్లుగా జననాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంతో, డ్రాగన్ దేశం కొత్తగా నగదు ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. పిల్లల సంరక్షణకై తల్లిదండ్రులకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు, ఒక్కో బిడ్డకు ఏడాదికి 3600 యువాన్‌లు (సుమారు రూ.42,000) చొప్పున నగదు బదిలీ చేయాలని చైనా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

- Advertisement -

ఈ పథకం మూడేళ్ల వయసు వరకు పిల్లలకు వర్తింపజేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పిల్లల పెంపక వ్యయభారాన్ని తగ్గించడంతో పాటు, యువ దంపతులు సంతానోత్పత్తి వైపు మొగ్గు చూపాలని ఆశిస్తోంది. ఈ విషయంపై చైనా మంత్రివర్గం ఇప్పటికే సమీక్ష జరుపుతోందని ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది.

Readmore:https://teluguprabha.net/international-news/manhattan-skyscraper-shooting-nypd-officer-killed/

గతేడాది చైనాలో 90 లక్షల 54 వేల మంది మాత్రమే జన్మించారు. 2016లో నమోదైన 1.8 కోట్ల జననాలలో పోలిస్తే గతేడాదిలో జననాల సంఖ్య సగానికి పడిపోయింది. 30 ఏళ్ల పాటు కొనసాగిన ఒకే బిడ్డ విధానంను 2016లో రద్దు చేసినప్పటికీ, జనాభా పెరుగుదలలో మాత్రం స్పష్టమైన మార్పు కనిపించలేదు. ఆర్థిక భారంతో వివాహాల సగటు రేటు పడిపోవటం కూడా సంతాన ఉత్పత్తికి ఒక ముఖ్య కారణమని చైనా ప్రభుత్వం గుర్తించింది.

ఇప్పటికే చైనాలోని హోహోట్‌ నగరం మొదటి సంతానానికి 10 వేల యువాన్‌లు, రెండవ సంతానానికి 50 వేల యువాన్‌లు, మూడవ సంతానానికి లక్ష యువాన్‌ల నగదు అందిస్తోంది. టియాన్మెన్‌ నగరం కూడా రెండో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు 6500 యువాన్‌లు, చిన్నారికి మూడేళ్లు వచ్చే వరకు నెలకు 800 యువాన్‌లు అందిస్తోంది. అలాగే మూడో బిడ్డ పుడితే నెలకు వెయ్యి యువాన్‌లు అందిస్తోంది.

Readmore: https://teluguprabha.net/international-news/thailand-cambodia-border-dispute-resolution/

ఈ క్రమంలో, చైనా ప్రభుత్వం తల్లిదండ్రులకు నగదు, గృహ సబ్సిడీలు, ఉచిత వైద్య సేవలు, పాలు వంటి పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తూ జనాభా పెంపునకు చర్యలు చేపడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా రెండో స్థానానికి పడిపోయింది. తిరిగి ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఈ చర్యలు కీలకమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad