Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nepal Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Nepal Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

- Advertisement -

Nepal Accident: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది ప్రయాణిస్తున్న బొలేరో జీప్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఛెడ్గఢ్ మున్సిపాలిటీలోని లెవే నేపాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

చెడ్ ఘడ్ మున్సిపాలిటీలోని leve ప్రాంతానికి వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ముందుగా గాయాలపాలై వారిని ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. మృతులంతా ఖాట్మండు, ఛెడగడ్ మున్సి పాలిటీకి చెందినవారని పోలీసులు గుర్తించారు.

పోస్ట్ మార్టం నిమిత్తం మృ తదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad