Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Kenya: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి, 30 మంది గల్లంతు

Kenya: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి, 30 మంది గల్లంతు

Kenya landslide: ఆఫ్రికా దేశమైన కెన్యాలో పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన కెన్యా దక్షిణ ప్రాంతంలోని మారాక్‌వెట్‌ కౌంటీలో సంభవించింది. వర్షాకాలం కావడంతో ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయని కెన్యా అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు.

- Advertisement -

గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు (రెస్క్యూ ఆపరేషన్) కొనసాగుతున్నాయని అన్నారు. కొండచరియల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నట్టుగా సదరు మంత్రి తెలిపారు. ఈ ఘటనతో మారాక్‌వెట్‌ ప్రాంతంలో తీవ్ర భయాందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad