Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Shooting During Mass: స్కూల్‌లో ప్రార్థనల వేళ కాల్పుల మోత.. ముగ్గురి మృతి!

Shooting During Mass: స్కూల్‌లో ప్రార్థనల వేళ కాల్పుల మోత.. ముగ్గురి మృతి!

Shooting During Mass at Minneapolis Catholic School: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మినియాపొలిస్‌లోని ఓ కేథలిక్ పాఠశాలలో బుధవారం ఉదయం ప్రార్థనల సమయంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. పాఠశాల ప్రారంభమైన తొలి వారంలోనే ఈ ఘోరం జరగడం తీవ్ర విషాదానికి దారితీసింది.

- Advertisement -

అమెరికా న్యాయ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిలో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా ముగ్గురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మార్నింగ్ మాస్ (ఉదయకాల ప్రార్థనలు)లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ ఊహించని దాడి జరిగింది.

ALSO READ: Trump tariffs : రష్యా చమురుపై ట్రంప్ కొరడా.. భారత్ వెనక్కి తగ్గిందా..? తెర వెనుక కథేంటి..?

సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎఫ్‌బీఐ ఏజెంట్లు, అంబులెన్సులు పాఠశాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు.

మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఈ ఘటనను “భయంకరమైన హింసాత్మక చర్య”గా అభివర్ణించారు. “పాఠశాల మొదటి వారంలోనే ఇలాంటి దారుణం జరగడం అత్యంత బాధాకరం, పిల్లలు, ఉపాధ్యాయుల కోసం ప్రార్థిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

ALSO READ: New World Screwworm Myiasis USA : అమెరికాను వణికిస్తున్న కొత్త వైరస్.. మాంసం తినే భయానక ఈగల వ్యాధి

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషాద ఘటనపై స్పందిస్తూ, పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. గత 24 గంటల్లో మినియాపొలిస్ నగరంలో ఇది మూడో కాల్పుల ఘటన కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టిస్తోంది.

ALSO READ: Donald Trump : అప్పుడు ఐదు.. ఇప్పుడు ఏడు! భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ పాత పాటే.. కొత్త లెక్క!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad