Saturday, April 26, 2025
Homeఇంటర్నేషనల్Iran: ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు.. 500 మందికి గాయాలు

Iran: ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు.. 500 మందికి గాయాలు

ఇరాన్(Iran) దక్షిణ ప్రాంతం బందర్ అబ్బాస్‌‌లోని షాహిద్ రాజీ పోర్టులో భారీ పేలుడు(Blast) సంభవించింది. ఒమన్‌లో ఇరాన్, అమెరికా మధ్య మూడో రౌండ్ అణు చర్చలు ప్రారంభమైన సమయంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. అయితేపేలుడుకు సంబంధించిన కచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. రాజీ ఓడరేవులోని ఓ కంటైనర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 516 మంది గాయపడినట్లు భావిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందతిస్తున్నారు.

- Advertisement -

మరోవైపు ఈ పేలుడుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) చెప్పింది. షాహిద్ రాజీ పోర్ట్ కంటైనర్ ట్రాఫిక్‌కి ప్రధాన కేంద్రంగా ఉంది. చమురు నిల్వ, ప్రెట్రో కెమికల్ కార్యకలాపాలు ఈ రేవు గుండా సాగుతుంటాయి. అయితే ఈ పేలుడు చమురు సౌకర్యాలపై ఎటువంటి ప్రభావం చూపలేదని నేషనల్ ఇరానియన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (NIPRDC) స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News