Gaming Platforms: సరదాగా గడపడం కోసం వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాం. కానీ ఇపుడు అవే ప్రమాదకరంగా మారుతున్నాయని బ్రిటిష్ పరిశోధకులు వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు అంతర్జాలంలో ఆటలు ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉద్యోగ సమయాలలో కాసేపు రిలాక్స్ కోసం ఏదో ఒక ఆట ఆడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక పిల్లలు, ఇంట్లో ఉండే వ్యక్తులు గంటల తరబడి వాటికే అంకితం అవుతున్నారు.
ఇపుడు వస్తున్న గేమ్స్ లలో ఎదుటి వారితో సంభాషించటానికి వీలుగా చాట్ ఆప్షన్, వాయిస్ కాల్ ఆప్షన్ ఇస్తున్నారు. ఇటువంటి ప్లాట్ ఫామ్ లలో నియంత్రణ తక్కువగా ఉండటంతో తీవ్రవాద బృందాలు ఈ ఆప్షన్స్ ని వినియోగించుకుంటున్నారని బ్రిటిష్ పరిశోధకులు వెల్లడించారు. ఈ తీవ్రవాద బృందాలు వారికి అనుగుణంగా ప్రజలలో ద్వేష భావాలు నింపి తమవైపుకు వచ్చేలా ప్రేరేపిస్తున్నాయి.
Readmore: https://teluguprabha.net/international-news/india-halts-f35-deal-us-russia-defense-relations/
ఈ వీడియో గేమ్స్ ఆడేటపుడు లైవ్ స్ట్రీమింగ్ కి వీలుగా కొన్ని గేమింగ్ ప్లాట్ ఫామ్స్ పై నియంత్రణ తక్కువగా ఉంటుంది. వీటిని ఆసరాగా తీసుకుని తీవ్రవాద సంస్థలు సమాజంలో అసహిష్ణుతను పెంచే విధంగా అతి తీవ్ర భావజాలం, లింగ, జాతి, మత ఆధారిత వంటి హానికరమైన భావాల్ని విస్తరిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు.. తీవ్రవాదుల నియామకం చేయడానికి గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
సామజిక మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించడం ఈ తీవ్రవాద బృందాలకు తేలిక అయింది. హింసను ప్రోత్సహించే షూటింగ్ వంటి ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వారిని లక్ష్యంగా చేసుకుని, వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ.. వారిని తమ బృందాలలో చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారని పరిశోధనలో వెల్లడించారు. ఇటువంటి వాటిని కృత్రిమ మేధస్సుని ఉపయోగించి నియత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధ్యయన కర్తలు సూచించారు. అలాగే ఇటువంటి వాటికీ దగ్గర కాకుండా ఉండేలా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ పరిశోధకులు వెల్లడించారు.


