Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Actress Manisha Koirala on Nepal Protest: నేపాల్ హింస..మనీషా కోయిరాలా సంచలన కామెంట్స్

Actress Manisha Koirala on Nepal Protest: నేపాల్ హింస..మనీషా కోయిరాలా సంచలన కామెంట్స్

Manisha Koirala: నేపాల్​లో అనూహ్యంగా హింస అంతకంతకు పెరుగుతోంది. సోమవారం నిరసనకారుల ప్రధాన డిమాండ్​ అయిన సోషల్​ మీడియాపై నిషేధం ఎత్తి వేసినప్పటికీ మంగళవారం అది మరోరూపం తీసుకుంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలీ ప్రైవేటు ఇల్లు సహా అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్​ ఇల్లును కూడా తగులబెట్టారు. నేపాల్​ పార్లమెంటులోకి చొచ్చుకెళ్లి భవనానికి నిప్పు పెట్టారు.  దీంతో నేపాల్​ ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యం ప్రధాని ఒలీ తన పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -

అటు మాజీ ప్రధాని పుష్పకుమార్​ దహల్​, ఇతర ప్రముఖులు, రాజకీయ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగలు..కొన్ని చోట్ల ధ్వంసం చేస్తున్నారు.

తన దేశంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో బాలీవుడ్​ సీనియర్​ నటి మనీషా కోయిరా స్పందించారు. రక్తంతో తడిసిన బూటు ఫొటోను తన సోషల్​ మీడియా అకౌంట్లో షేర్​ చేస్తూ మంగళవారం ‘బ్లాక్​ డే’ కామెంట్​ చేశారు. ‘ఈ రోజు నేపాల్​కు బ్లాక్​ డే. అవినీతి, న్యాయంకోసం ప్రజల నుంచి ఉద్యమం డిమాండ్​, గొంతుకు బుల్లెట్లు సమాధానం చెబుతున్నాయి’ అంటూ ఆవేదనను వెలిబుచ్చారు.

దీంతోపాటు నేపాల్​ ప్రజలు ఏమీ కోరుకుంటున్నారనే అంశంపై పబ్లిష్​ అయిన పలు ఆర్టికల్స్​ షేర్​ చేశారు. 1970లలో నేపాల్​లో జన్మించిన మనీషా పలు నేపాలీ సినిమాల్లో నటించారు. అనంతరం భారత్​లో పలు భాషల్లో నటించి మెప్పించారు. కాగా ఆమె కుంటుంబం నేపాల్​లో రాజకీయాల్లో ఉంది.

ఏమిటీ జెన్​ జీ నిరసన

నేపాల్ ప్రభుత్వం దాదాపు 26 దాకా సోషల్  మీడియా ప్లాట్​ఫాంలను  దేశంలో బ్యాన్​ చేసింది. అందులో ఫేస్​బుక్​, యూట్యూబ్​, ఎక్స్​, ఇన్​స్టాగ్రాం, స్నాప్​చాట్​ వంటివి ఉన్నాయి. సోషల్​ మీడియాపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తూ సోమవారం జెన్​ జీ ఆందోళన పేరుతో ఖాఠ్మండులో భారీ ఎత్తున నిరసనకు దిగారు. అది పోలీసుల కాల్పుల దాకా వెళ్లింది. ఈ కాల్పుల్లో దాదాపు మంది చనిపోగా దాదాపు 300 దాకా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి సోషల్ మీడియాపై బ్యాన్​ ఎత్తి వేసింది.

అయితే హింసకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

మరోవైపు మంగళవారం నిరసనకారులు ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని, ఆశ్రిత పక్షపాతం పెరిగిందని డిమాండ్​ చేస్తూ మళ్లీ రోడ్లమీదకు వచ్చారు. అంతేకాదు నేరుగా ప్రధాని, అధ్యక్షుల ప్రైవేటు నివాసాలకు నిప్పు పెట్టారు. దీంతో హింస పెరిగింది. ప్రస్తుత సంఘటనలతో ప్రధాని ఒలీ రాజీనామా చేశారు.

అంతకుముందు ఈ హింస వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అయితే ఒలీ రాజీనామా అనంతరం విదేశాలకు పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad