సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న 179 మంది సజీవ దహనం అయినట్టు సమాచారం. ల్యాండింగ్ అవుతున్న బోయింగ్ విమానం సడన్ గా పేలిపోయినట్టు కెమరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
- Advertisement -
విమానంలో మొత్తం 181 మంది ఉండగా వారిలో 175 మంది ప్రయాణికులు కాగా ఆరుగురు విమాన సిబ్బంది. సౌత్ కొరియాలోని మువాన్ ఎయిర్ పోర్ట్ లో ఈ ప్రమాదం సంభవించింది.
కేవలం ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు ప్రాణాలతో బయపడినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విమానం ల్యాండ్ అయ్యే సమయంలో పక్షి తగిలినందుకే ల్యాండింగ్ గేర్ లో ఇబ్బందులు తలెత్తినట్టు, వాతావరణం సరిగ్గా లేకపోవటం వంటి కారణాలు ఏవైనా ఉంటాయని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.