Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Airplane accident: సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం.. ఇద్దరు మృతి

Airplane accident: సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం.. ఇద్దరు మృతి

Airplane accident in hongkong: హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి హాంకాంగ్ కు వచ్చిన తుర్కియేకు చెందిన బోయింగ్ 747 కార్గో ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో రన్ పైనుంచి జారిపోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న సముద్రంలోకి విమానం దూసుకెళ్లింది. దీంతో విమానం సగం వరకు మునిగిపోయింది. ఇవాళ తెల్లవారుజామున సుమారు 3:50 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనా సమయంలో రన్ వేపై ఉన్న గ్రౌండ్ వెహికల్ ని విమానం ఢీకొట్టటంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

విమాన గ్రౌండ్ వాహనాన్ని ఢీకొట్టటంతో అది కూడా సముద్రంలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఆ వాహనంలోని ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలించిన అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే అత్యంత రద్దీగా ఉండే హాంకాంగ్ విమానాశ్రయంలోని ఉత్తర రన్ వేపై ఈ ప్రమాదం జరగ్గా.. ప్రస్తుతానికి ఈ రన్ వే వాడుకలో లేదని సమాచారం. విమానాశ్రయంలోని మిగతా రెండు రన్ వేలు పనిచేస్తున్నాయని అధికారులు చెప్పారు.

Also Read:https://teluguprabha.net/international-news/battery-explode-in-passengers-luggage-while-travelling-in-air-china/

విమానంలోని మిగతా నలుగురు సిబ్బంది సేఫ్ గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లైట్ లో ఎలాంటి సరుకు లేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదం గురించి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి నివేదించినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్లు తెలిపారు. దర్యాప్తులో సహకరిస్తామని హాంకాంగ్ పౌర విమానయాన శాఖ ధ్రువీకరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad