Monday, December 9, 2024
Homeఇంటర్నేషనల్AIRCEL: ఎయిర్ సెల్ అధినేత ఆనంద కృష్ణన్ కన్నుమూత

AIRCEL: ఎయిర్ సెల్ అధినేత ఆనంద కృష్ణన్ కన్నుమూత

AIRCEL| ప్రముఖ పారిశ్రామికవేత్త, టెలికాం సంస్థ ఎయిర్ సెల్ అధినేత ఆనంద కృష్ణన్(Anand Krishnan) మృతి చెందారు. కృష్ణన్(86) మృతిపై మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఎక్స్ వేదికగా స్పందించారు. కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ ఎన్నో సేవలందించారని కొనియాడారు. అనేక దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించారని.. సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రశంసించారు. ఆయన మృతి మలేషియా పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

- Advertisement -

కాగా 1938లో మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో కృష్ణన్ జన్మించారు. ఆయన పూర్వీకులకు భారత్‌కు చెందిన వారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావంతమైన పారిశ్రామిక వేత్తగా ఎదిగారు.

ఆయనకు ముగ్గురు సంతానం ఉన్నారు. కుమారుడు థాయిలాండ్‌లో బౌద్ధ సన్యాసిగా మారగా.. మిగిలిన ఇద్దరు కుమార్తెలు కృష్ణన్ వ్యాపారాల్లో పాలుపంచుకోలేదు. ఇక కృష్ణన్ ఎయిర్‌సెల్ కంపెనీ భారత్ టెలికాం రంగంలో కొన్ని సంవత్సరాల పాటు అగ్రగామిగా రాణించింది. ఇక కృష్ణన్ గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ స్పాన్సర్లలో ఒకరిగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News